ఈ మధ్యకాలంలో యువతీ యువకులు పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకునేందుకు డేటింగ్ చేయడానికి సిద్దపడుతున్నారు. దీనివల్ల ఇద్దరి ఇష్టాఇష్టాలు, ఆలోచనలపై ఒక అవగాహన ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే ఓ యువతి డేటింగ్ యాప్ లో భాగస్వామికోసం వెతకగా ఓ మహిళ తనను తాను అబ్బాయిగా పరిచయం చేసుకుని, ఆ యువతితో రెండేళ్లు సహజీవనం చేసిన ఘటన చోటుచేసుకుంది.

డేటింగ్ యాప్ లో యువతికి భాగస్వామిగా పరిచయమైన ఓ 40ఏళ్ల మహిళ తనను తాను అబ్బాయిగా పరిచయం చేసుకుని రెండేళ్లు సహజీవనం చేసింది. అంతేకాకుండా ఊహకందని రీతిలో ఆ యువతితో రెండు సార్లు శృంగారంలో కూడా పాల్గొంది. చివరకు ఫేస్ బుక్ ద్వారా అబ్బాయి కాదు మహిళ అని తెలిసి నివ్వెరపోయింది. చివరికి ఆ యువతి కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన యూకెలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 2016లో బ్లేడ్ సిల్వానో అనే మహిళ తనను తాను పురుషుడిగా తెలుపుకుంటూ ఓ డేటింగ్ సైట్ లో యువతిని పరిచయం చేసుకుంది. తాను యూకె ఆర్మీలో పనిచేస్తున్నానని తెలిపింది. రెండు సంవత్సరాల పాటు పురుషుడిగా నమ్మిస్తూ మోసం చేసింది. అయితే ఈ ఘటనపై బాధితురాలు తామిద్దరం రెండేళ్లపాటు రిలేషన్ లో ఉన్నామని, రెండుసార్లు శృంగారంలో కూడా పాల్గొన్నామని కేంబ్రిడ్జ్ క్రౌన్ కోర్టుకు తెలిపింది.
సిల్వానో తన కళ్లకు గంతలు కట్టి సెక్స్ టాయ్ తో శృంగారంలో పాల్గొన్నట్లు తెలిపింది. ఆ తరువాత తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించింది. వివాహానికి సిద్ధమైన వేళ పెళ్లి బట్టలు ధరించి ఫోటో తీసుకుని సిల్వానోకు పంపానని యువతి చెప్పుకొచ్చింది. అయితే ఫెస్ బుక్ లో బ్లేడ్ సిల్వానో ఫోటో వేరే పేరుతో ఉండటంతో అనుమానం వచ్చినట్లు తెలిపింది. వివరాలు సేకరించిన తరువాత సిల్వానో పురుషుడు కాదని తేలిపోయింది. దీంతో తాను మోసపోయినట్లు బాధితురాలు జడ్జీల ముందు గోడు వెల్లబోసుకుంది. అంతేకాకుండా సిల్వానో మహిళా అనే విషయం దాచేందుకు పడకగదిలో ఎప్పుడు ఒంటిపై బట్టు తీసేది కాదని, తాను తాకాలని చూసినా అందుకు తిరస్కరించేదని తెలయజేసింది. అయితే నిందితురాలైన సిల్వానో తామిద్దరం ఎప్పుడు ప్రత్యక్షంగా కలువలేదని, ఆన్ లైన్ లో మాత్రమే కలుస్తుండే వాళ్లమని వెల్లడించింది. ప్రస్తుత కాలంలో డేటింగ్ యాప్స్ తో పలు రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.