సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకు కూడా భద్రత లేదు. పార్లమెంట్ లో కూడా ఓ మహిళా ఎంపీని కోరిక తీర్చమంటూ ఓ పలుకుబడి ఉన్న నేత వేధించేవాడట. ఆమె ఆరోపణలు చేయడంతో పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది.
సాధారణ మహిళలకే కాదు, అసాధారణ మహిళలకు కూడా రక్షణ లేదు. రాజకీయాల్లో చక్రం తిప్పే మహిళా రాజకీయ నాయకురాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అసలు పార్లమెంట్ అంటే దేవాలయం. అలాంటి దేవాలయంలో కేవలం సమస్యలు, వాటి పరిష్కారం గురించి మాత్రమే చర్చించాలి. కానీ అవన్నీ వదిలేసి దేవాలయం లాంటి పార్లమెంట్ లో పాడు పనులు చేస్తున్నారు కొందరు నేతలు. తమ స్మార్ట్ ఫోన్లలో బూతు వీడియోలు చూసేవారు కొందరైతే.. పార్లమెంట్ సాక్షిగా మహిళా నేతలను కోరిక తీర్చమని వేధించేవారు కొందరు. తాజాగా ఓ మహిళా ఎంపీ.. తాను పార్లమెంట్ సాక్షిగా లైంగిక వేధింపులకు గురయ్యానంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఆస్ట్రేలియా మహిళా ఎంపీ లిడియా థోర్ప్ లైంగిక వేధింపులపై సంచలన ఆరోపణలు చేశారు. మహిళలు పని చేసేందుకు పార్లమెంట్ సురక్షితమైన చోటు కాదని అన్నారు. పలుకుబడిని ఓ నేత తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, తాకరాని చోట తాకుతూ కోరిక తీర్చమని వేధించేవాడని ఆమె ఆరోపించారు. పార్లమెంట్ భవనంలోని తన కార్యాలయం నుంచి ఒంటరిగా బయటకు రావాలంటే భయమేసేదని.. తోడుగా ఒకరిని వెంటబెట్టుకుని పార్లమెంట్ లో తిరిగేదన్నాని ఆమె అన్నారు. ఇలాంటి చేదు అనుభవాలను చాలా మంది ఎదుర్కున్నా గానీ తమ కెరీర్ పై ప్రభావం పడుతుందని ఎవరూ బయటకు రావడం లేదంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను లిబరల్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ వాన్ లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆమె అన్నారు.
అయితే లిడియా చేసిన ఆరోపణలను వాన్ ఖండించారు. ఆమె చేసిన ఆరోపణలు నిజం కావని మీడియాతో అన్నారు. అయితే డేవిడ్ వాన్ ను లిబరల్ పార్టీ సస్పెండ్ చేసింది. ఇలాంటి ఘటనలు ఇదేమీ తొలిసారి కాదు. 2019లో మార్చి నెలలో బ్రిటనీ హిగ్గిన్స్ అనే కార్యకర్త.. తోటి కార్యకర్తపై పార్లమెంట్ భవనంలోని ఆఫీస్ రూమ్ లో అత్యాచారానికి పాలపడినట్లు ఆరోపణలు ఎదుర్కున్నాడు. కానీ ఇప్పటికీ ఈ ఘటనపై ఎలాంటి విచారణ జరగలేదు. ఆస్ట్రేలియా పార్లమెంట్ మహిళా సభ్యుల్లో 63 శాతం మంది ఏదో ఒక విధమైన వేధింపులకు గురవుతున్నారంటూ ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చడం గమనార్హం.