పిదప కాలం పిదప బుద్ధులు అన్నారు పెద్దలు. మున్ముందు ఎన్ని విపరీతాలు చూడాల్సి వస్తుందే. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో యువత తీసుకుంటున్న నిర్ణయాలైతే నొసలు చిట్లించక తప్పడం లేదు. వయసులో ఎంతో వ్యత్యాసం ఉంటున్న వ్యక్తుల ప్రేమలో మునిగి తేలడం ఓ లెక్క అయితే.. వారితో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా ఓ యువతి ఏకంగా తండ్రినే మనువాడి వార్తల్లో నిలిచింది.
ఇది నిజంగా కలికాలమమ్మా, ఎన్నెన్ని విడ్డూరాలు చూడాలో, ఎన్ని వింతలు వినాలో అని పెద్దలు ఊరికే బుగ్గలు నొక్కుకుంటారా.? ఏదైనా జరగరానిది జరిగితే.. సాధ్యం కాదూ అనుకున్నదీ సుసాధ్యం అయితే ఇటువంటి మాటలే వస్తుంటాయి కదా. నిజమే మరీ ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లు చూస్తుంటే ఇలా అనక తప్పడం లేదు. గతంలో అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు పెళ్లిళ్లు చూసి చేశావారట. అది కనుమరుగై నయా ట్రెండ్ దూసుకు వస్తోంది. తన కంటే వయసులో చాలా వ్యత్యాసం ఉన్న వ్యక్తుల ప్రేమలో పడుతూ.. వారితో ఏడడుగులు వేస్తున్నారు యువతీ యువకులు. తండ్రి వయస్సు వ్యక్తులతో రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు యువతులు. అయితే ఆ యువతి మాత్రం ఏకంగా తండ్రినే వివాహమాడి వార్తల్లో నిలిచింది. వినడానికి ఏదోలా ఉన్న ఇది నిజం.
అమెరికాలోని లాస్ వెగాస్‌లో నివసించే క్రిస్టీ అనే యువతి తండ్రి వరుస అయ్యే వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంది. అతడితో ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత ఈ జంట వివాహం చేసుకుంది. క్రిస్టీ వివాహం చేసుకున్న వ్యక్తి ఆమె తల్లి మాజీ భర్త. అంటే క్రిస్టీకి సవతి తండ్రి. అతడిని చూడగానే ప్రేమలో పడింది. తర్వాత రిలేషన్ షిప్‌లో ఉన్న వారిద్దరూ ఇటీవల పెళ్లి చేసుకుని భార్యాభర్తలు బంధంలోకి అడుగుపెట్టారు. క్రిస్టీ..సవతి తండ్రితో వివాహం తన జీవితంలో అత్యత్తమ నిర్ణయమని, తాను అదృష్టవంతురాలిని అంటూ సోషల్ మీడియాలో తన వివాహ వేడుకులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
మ్యారీ యువర్ మామ్స్ ఎక్స్ ( #MarryYourMomsEx)అనే వీడియోను కూడా క్రిస్టీ షేర్ చేసింది. ఆమె చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఆ తర్వాత ఆమెను విపరీతంగా తిట్టి పోస్తున్నారు నెటిజన్లు. ప్రపంచంలో 7 బిలియన్ల మంది ఉండగా.. ఆయన్నే వివాహం ఎందుకు చేసుకున్నామని ఓ నెటిజన్ ప్రశ్నించారు. అతడు నాన్న స్థానం నుండి నాన్న అయ్యాడు అంటూ మరొకరు సెటైర్ వేశారు. విదేశాల్లో ఇలాంటి కామనే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, తన తల్లితో కూడా తనకు ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయని,ఆమెతో మాట్లాడుతూనే ఉన్నట్లు క్రిస్టీ తెలిపింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో ఇలా వయస్సుతో నిమిత్తం లేకుండా, వావి వరుసలు మర్చిపోయి చేసుకుంటున్న పెళ్లిళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.