ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరలవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. కొన్ని మనసుకు కదిలిస్తాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ప్రేమలో ఉన్న వారికి తమ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. ప్రియుడి, ప్రియురాలి ఊహల్లో.. లోకాన్ని మర్చిపోతారు. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతి రోజు స్పెషలే. ఇక ప్రేమికుల రోజు వచ్చిందంటే.. చాలు లవర్స్‌కి అన్ని పండగలు కలిపి వచ్చినట్లే. ప్రపంచానికి దూరంగా ఏకాంత ప్రదేశానికి వెళ్లి.. స్వీట్ నథింగ్స్ పంచుకుంటూ.. సరదాగా గడపాలని భావిస్తారు. ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి.. మరీ అంత ఏకాంత ప్రదేశానికి వెళ్లలేదు. వాలెంటైన్స్ రోజున గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకుని ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా.. సడెన్‌గా ఓ మహిళ ఎంట్రీ ఇచ్చింది. దాంతో మనవాడికి పైప్రాణాలు పైనే పోయాయి. ఇక ఎంట్రీ ఇచ్చిన మహిళ చేసిన పనికి ఇంటర్నెట్ కూడా షేకయ్యింది. ఇంతకు ఆ వచ్చిన మహిళ ఎవరు.. ఏం చేసిందో తెలియాలంటే ఇది చదవండి.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియవు. ఇక ప్రేమికుల రోజు సందర్భంగా ఓ యువకుడు తన లవర్‌ని తీసుకుని ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు. ఓ చోట కూర్చుని.. తమ ఫెవరెట్ ఫుడ్ ఆర్డర్ చేశారు. భోజనం వచ్చేలోపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇంతలో ఎదురుగా ఓ వ్యక్తి వచ్చి నిలబడితే.. ఫుడ్ వచ్చిందేమో అని తలెత్తి చూశాడు యువకుడు. కానీ ఎదురుగా తన అమ్మ దర్శనం ఇచ్చింది.
గర్ల్‌ఫ్రెండ్‌తో రెస్టారెంట్‌కి వచ్చి.. తల్లి ముందు అడ్డంగా బుక్కయ్యాడు. కొడుకు చేసిన పని చూసి.. ఆ తల్లికి చిర్రెత్తుకొచ్చింది. తాను ఎక్కడ ఉన్నది.. చుట్టు జనాలు ఉన్నారనే సంగతి కూడా మర్చిపోయి.. చెప్పు తీసుకుని.. కొడుకును వీర బాదుడు బాదింది. అంతటితో ఆగక.. తన కొడుకుతో కలిసి వచ్చిన యువతిని కూడా వీర ఉతుకుడు ఉతికింది. చుట్టూ ఉన్న వాళ్లు.. చూస్తూ ఉండిపోయారు.. కానీ ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఇది చూసిన నెటిజనులు.. దేశీ మాతా.. ఇలానే రియాక్టవుతుంది.. అరే భయ్.. ఎవరో నీ మీద పగతో.. మీ డేట్ విషయం మీ ఇంట్లో లీక్ చేసి ఉంటారు.. అందుకే ఇలా అడ్డంగా బుక్ అయ్యావ్ అని కామెంట్స్ చేస్తుండగా.. కొందరు మాత్రం ఆ మహిళ చేసిన పనిని తప్పు పడుతున్నారు. మరీ అంతలా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Desi Parents #HappyValentinesDay 🤪🤪 pic.twitter.com/Tj4qKvAVW8
— Arzoo Kazmi|आरज़ू काज़मी | آرزو کاظمی | 🇵🇰✒️🖋🕊 (@Arzookazmi30) February 14, 2023