అమెరికాలో బియ్యం కష్టాలు మొదలయ్యాయి. బియ్యం కోసం స్టోర్ ల ముందు కోటీశ్వరులు క్యూలు కడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలకు నాన్ బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేయడం నిషేధించింది. భారతదేశం బాస్మతి బియ్యంతో పాటు సాధారణ బియ్యాన్ని కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. అయితే బాస్మతి బియ్యాన్ని కాకుండా సాధారణ బియ్యాన్ని మాత్రం ఎగుమతి చేయకుండా నిషేధించింది. ప్రపంచంలోనే ఎక్కువగా బియ్యం ఎగుమతి చేసే దేశం మనదే. అలాంటిది ఇప్పుడు బియ్యం ఎగుమతులను ఆపివేయడం వల్ల చాలా దేశాల్లో బియ్యం సంక్షోభం ఏర్పడనుంది. యూరప్, అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండం సహా అనేక దేశాలకు మన దేశం నుంచి బియ్యం ఎగుమతి అవుతుంది. ఈ జాబితాలో నేపాల్, కామెరూన్, ఫిలిప్పీన్స్, చైనా సహా చాలా దేశాలు ఉన్నాయి.
ప్రపంచంలో 90 శాతం బియ్యం ఆసియా ఖండం నుంచి ఉత్పత్తి అవుతుండగా.. అందులో 45 శాతం వాటా భారత్ దే. బాస్మతి బియ్యం ఉత్పత్తిలో 80 శాతం భారత్ వాటా ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తి చేసే దేశంగా భారత్ ఉండగా.. 2012 నుంచి అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంటూ వస్తుంది. అయితే కేంద్రం బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిషేధించిన కారణంగా అమెరికాలో భారతీయులు తిప్పలు పడుతున్నారు. అమెరికాలోని బియ్యం స్టోర్ ల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ధరలను పెంచేశారు. సోనామసూరి బియ్యానికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
దీంతో అక్కడ భారతీయులకు బియ్యం కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలుగు వాళ్ళు బియ్యం కోసం అక్కడ పడిగాపులు కాస్తున్నారు. బియ్యం స్టోర్ ల ముందు క్యూ కడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా కేంద్రం ప్రకటనతో ఎక్కడ బియ్యం సంక్షోభం తలెత్తుతుందోనన్న భయంతో ఒక్కొక్కరూ ఐదారు రైస్ బ్యాగులను పట్టుకెళ్తున్నారు. దీంతో పరిమితంగానే కొనుగోలు చేయాలని షరతులు విధిస్తున్నారు. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు కూడా ఇదే అదనుగా భావించి అధిక రేట్లకు అమ్ముతున్నారు.
After Banning Rice Exports From India, Indians situation in USA to buy rice bags🥲
Those who are living in USA Immediately go to your nearby Indian Store and get some Rice Bags Before its too late🚨🚨#RiceBanInUSA pic.twitter.com/vAumv6fedv
— Prabhas Fans USA🇺🇸 (@VinayDHFprabhas) July 21, 2023