అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు రోజు రోజుకు హద్దులు దాటుతున్నాయి. దాదాపుగా దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో వీరి ఆగడాలను భరించలేక ప్రధానమంత్రి అశ్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు మెల్లమెల్లగా దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకుని ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్నారు.
వీరి పాలనలో మేము ఉండలేమని భావించిన అఫ్ఘాన్ ప్రజలు కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి ఇతర దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఇక తాజాగా తాలిబన్ల మరో ఘటన దేశంలోని ప్రజలకు వెన్నులో వణుకు పుట్టేలా చేస్తోంది. ఒక వ్యక్తి శవాన్ని అమెరికా హెలికాప్టర్ కు కట్టి కందహార్ ప్రావిన్స్ మొత్తం చుట్టి వచ్చారు. దీనిని కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటంతో వీడియో వైరల్ గా మారింది.
https://www.youtube.com/watch?v=vaN7GRgG52c