కరోనా వైరస్ కేసుల్లో అత్యంత ప్రమాదకరమైన మ్యూటెంట్ గా నిపుణులు డెల్టా మ్యూటెంట్ ను గుర్తించారు. ఇప్పటికే మన దేశంలో సెకండ్ వేవ్ సమయంలో ఈ మ్యూటెంట్ అధికంగా వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. దీనివల్ల కేసుల సంఖ్య వేగంగా పెరగటంతో పాటు మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. ఈ వేరియంట్ కు వ్యాక్సిన్ నుండి తప్పించుకునే గుణం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
రీసెంట్ గా జరిగిన పరిశోధనలో శాస్త్రవేత్తలు డెల్టా వేరియంట్ గురించి సంచలన విషయాలు భయటపెట్టారు. ఇతర వేరియంట్ లు సోకిన దానికంటే డెల్టా వేరియంట్ బారిన పడితే వైరస్ లోడ్ 300 రెట్లు అధికంగా ఉన్నట్టు నిర్దారించారు. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. డెల్టా వేరియంట్ సోకిన వారిలో పది రోజుల తర్వాత కానీ ఇతర వేరియంట్లలో ఉండే వైరల్ లోడ్ స్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు.
ఈ విషయాన్ని ఇంత కచ్ఛితంగా ఎలా చెబుతున్నారంటే డెల్టా వేరియంట్ సోకిన 1848 మందిని ఇతర వేరియంట్ల బారిన పడిన 22వేల మందికి సంబంధించిన డేటాను విశ్లేషించినప్పుడు షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అత్యధిక వైరల్ లోడ్ కారణంగానే డెల్టా వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తోందని గుర్తించారు. ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.