ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకుని సతమతమవుతున్న లంకేయులకు ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఇంధన కొరతతో ఇబ్బందులుపడుతున్న లంక వాసులకు కొండెక్కి కూర్చున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారంగా మారాయి. మంగళవారం పెట్రోల్ ధరను 24.3 శాతం, డీజిల్ ధరను 38.4 శాతం మేర పెంచుతూ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆక్టేన్ 92 రకం పెట్రోల్ ధర 420 రూపాయలు, డీజిల్ 400 రూపాయలకు చేరింది. తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో విదేశీమారక నిల్వలు భారీగా క్షీణించాయి. దీంతో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వరంగ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. ఇంధన ధరల పెంపుతో ఆటోరిక్షా కార్మికులు సైతం రేట్లు పెంచనున్నట్లు ప్రకటించారు. మొదటి కిలోమీటర్‌కు 90 రూపాయలు, ఆపై ప్రతి కిలోమీటర్‌కు 80 రూపాయల మేరకు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీలంకలో చమురు నిల్వలు అడుగంటిపోవడంతో అక్కడి వినియోగదారుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. 1948లో స్వాతంత్య్రం పొందినప్పటి నుండి ఇంతటి సంక్షోభం ముందెన్నడూ లేదు. దాదాపు అన్ని నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. విదేశీ నిల్వల కొరత కారణంగా ఇంధనం, వంటగ్యాస్, ఇతర నిత్యావసరాలకోసం జనుల క్యూలైన్లలో బారులు తీరుతున్న పరిస్థితి.
New #fuel prices updated today morning at 3 am. #slnews #srilanka #chokolaate pic.twitter.com/mKrPrn0MN9
— Chokolaate Media (@chokolaatemedia) May 24, 2022
ఇది కూడా చదవండి: Man: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సామాన్య యువకుడు..
శ్రీలంక తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, ఇంధనం అడుగంటిపోకుండా నిరోధించే చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఖర్చులను తగ్గించే చర్యగా, ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, ఆయా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను నిర్దేశించింది. మరోవైపు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.రవాణా, ఇతర సేవా ఛార్జీల సవరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందనీ ఈ ఫార్ములా ప్రతి పదిహేను రోజులకోసారి లేదా నెలకోసారి వర్తింపజేస్తామని విద్యుత్,ఇంధన శాఖ మంత్రి ట్విటర్‌లో తెలిపారు.
+++BREAKING+++
Sri Lanka hikes petrol prices by 20-24% and diesel prices by 35-38%, urging residents to work from home that it says “will be encouraged to minimise the use of fuel and to manage the energy crisis”. pic.twitter.com/sPgRV7Qpmt
— H24 NET (@H24Net) May 24, 2022