ఉక్రెయిన్‌పై రష్యా మిస్సెల్స్ వర్షం కురిపిస్తుంది. తన శక్తిమేర ఉక్రెయిన్ కూడా రష్యాను నిలువరించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ యుద్ధ వాతావరణంలో ఒక స్టార్ క్రికెటర్ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ 2014 జూన్ 22న చేసిన ‘కమాన్ రష్యా’ అనే ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి ఆర్చర్ అప్పుడు ఊహించాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా రష్యా.. క్రీమియా అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో ఆర్చర్ ఈ ట్వీట్ చేసినట్లు సమాచారం. క్రీమియా అప్పట్లో ఉక్రెయిన్ ఆధీనంలో ఉండేంది. అబద్ధపు ప్రజాభిప్రాయ సేకరణతో రష్యా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అప్పుడు ఆర్చర్ చేసిన కమాన్ రష్యా ట్వీట్ ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా దాడి సమయంలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఆర్చర్‌ను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మరి ఆర్చర్ ట్వీట్‌పై, ఉక్రెయిన్‌పై రష్యా దాడి గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Come on russia!
— Jofra Archer (@JofraArcher) June 22, 2014