సముద్రాల్లో ఉండే సొర చేపలు ఎంత ప్రమాదకరమో తెలిసిందే. ఓ సినిమాలో ఓ హీరో సొరచేపతో ఫైట్ చేసి దాని నుంచి తప్పించుకుని విలన్లకు దిమ్మతిరిగే షాక్ ఇస్తాడు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం దానికి విరుద్దంగా జరిగింది. పర్యాటకానికి వచ్చిన ఓ వ్యక్తి సముద్రం ఒడ్డున స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో ఓ సొర చేప వచ్చింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
పని ఒత్తిడి నుంచి సేదతీరేందుకు చాలామంది విహారయాత్రలు ప్లాన్ చేసుకుంటారు. ప్రపంచంలోని అందమైన ప్రదేశాలకు వెళుతుంటారు. అలా పర్యాటక ప్రదేశాలకు వెళ్లి వారికి నచ్చిన విధంగా చిల్ అవుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపుతాయి. విహార యాత్రలకు వెళ్లి ప్రమాదాలభారిన పడిన సంఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. అలాంటి ప్రమాదమే ఓ దేశంలో చోటుచేసుకుంది. విహార యాత్రకు వెళ్లి సముద్ర తీరాన ఈత కొడుతున్న సమయంలో ఆకస్మాత్తుగా జరిగిన పరిణామంతో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
విహారయాత్రలో భాగంగా వ్లాదిమిర్ పొపొవ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఈజిప్టులోని హుర్ఘదాలోని బీచ్ కు వచ్చారు. బీచ్ లో సరదాగా గడిపారు. కొంతసేపటి తర్వాత వ్లాదిమిర్ ఎర్ర సముద్రం తీరాన ఈతకొట్టాలని భావించాడు. అనుకున్నదే తడవుగా సముద్రం ఒడ్డునా స్విమ్మింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఓ సొర చేప తను ఈదుతున్న ప్రాంతంలోకి వచ్చింది. అది గమనించిన వ్లాదిమిర్ దాని నుంచి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశాడు. కానీ ఆ సొర చేప వ్లాదిమిర్ ను అమాంతం మింగేసింది. వ్లాదిమిర్ ను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది చేరుకునే లోపే ఈ ఘోరం జరిగిపోయింది.
ఈ హఠాత్పరిణామంతో అక్కడున్న మిగతా పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వ్లాదిమిర్ ఆ సొర చేప తనపై దాడి చేసే సమయంలో రక్షించమని ఆర్తనాదాలు చేశాడు. బీచ్ లో ఉన్న వ్లాదిమిర్ తండ్రి కళ్ల ముందే కొడుకు సొర చేపకు బలైపోవటంతో గుండెలవిసేలా రోదించాడు. ఆ ఘోరాన్ని అపే వీలులేక నిస్సాహాయ స్థితిలో ఉండిపోయాడు. క్షణాల్లోనే సొర చేప వ్లాదిమిర్ ను మింగేయడంతో అక్కడున్న పర్యాటకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బీచ్ లో ఉన్న ఓ వ్యక్తి సొర చేప దాడిచేస్తున్న దృష్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
https://twitter.com/i/status/1667039099851780097