అందం కోసం ఆడవాళ్లు చేయని ప్రయత్నాలు ఉండవు. అందంగా కనిపించేందుకు చిట్కాల దగ్గర నుండి కాస్మోటిక్స్ వస్తువులు వినియోగిస్తుంటారు. మొహంలో కొన్ని మార్పులు చేసుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటుంటారు. కానీ అదే ఆపరేషన్ విఫలమైతే.. పర్యవసనాలు కూడా తీవ్రంగా ఉంటాయి. అటువంటి ఘటనే ఇది.
ఆడవాళ్లు అలంకార ప్రియులు. అందం కోసం వివిధ రకాల చిట్కాల నుండి సౌందర్య ఉత్పత్తి సాధనాలను వరకు అన్ని వినియోగిస్తుంటారు. ఇక మోహంపై చేయని ప్రయోగాలుండవు. పళ్లు, కళ్లు, పెదాలు, ముక్కు వీటిలో ఏవన్నా తేడాగా అనిపించినా.. ప్లాస్టిక్ సర్జరీ, వాటికి సంబంధించిన ప్రత్యేక ఆపరేషన్లను చేయించుకుంటారు. కానీ ఈ ఆపరేషన్లు ఒక్కోసారి అందాన్ని తెచ్చి పెడితే.. మరోసారి బెడిసి కొడుతుంటాయి. అలా ఓ యువతి విషయంలో జరిగింది. ముక్కు ఆపరేషన్ చేయించుకుంటే ఏకంగా ఆమె ప్రాణాలే పోయాయి. వినడానికే షాక్ గా అనిపిస్తున్న ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
దక్షిణ అమెరికాలో కొలంబియాకి చెందిన 21 ఏళ్ల కారెన్ జూలియత్ కార్డెనాస్ ఉరిబ్ అనే యువతి సైకాలజీ చదువుతుంది. గత నెల 29న ఆమె రినోప్లాస్టీ (ముక్కుకు సంబంధించిన సర్జరీ) చేయించుకుంది. ఆపరేషన్ తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్లగా..తీవ్ర అస్వస్థతకు గురైంది. తిరిగి ఆసుప్రతికి తీసుకెళ్లగా.. పరిశీలించిన వైద్యులు ఊపిరితిత్తుల మొత్తం రక్తంతో నిండిపోయినట్లు గుర్తించారు. ఊపిరితిత్తులు, శ్వాస నాళం, అన్నవాహికలో రక్తం నిండిపోవడంతో ఊపిరి పీల్చుకోలేకపోయింది. అనంతరం ఆరు సార్లు కార్డియాక్ అరెస్టుకు గురవ్వడంతో ఆమె చనిపోయారు. అయితే ఆమెకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, కేవలం నోస్ జాబ్ ఆపరేషన్ (ముక్కు సర్జరీ) తర్వాత తన సోదరి జూలియత్ మరణించినట్లు సోదరుడు చెబుతున్నారు.
తన సోదరికి వైద్య పరమైన నిర్లక్ష్యంతో చనిపోయినట్లు తేలినట్లయితే తాము న్యాయ పరంగా ముందుకు వెళ్లతామని సోదరుడు తెలిపారు. ఈ నోస్ జాబ్ (ముక్కు సర్జరీ) అనేది కాస్మెటిక్ సర్జరీ. ముక్కును రీషేప్ చేసుకునేందుకు ఈ ఆపరేషన్ చేస్తారు. అమెరికాలో ఇటువంటి ఆపరేషన్లు ఎక్కువగానే జరుగుతుంటాయి. యుకెలో అయితే ఎక్కువ రినోప్లాస్టీ అనేది అత్యంత ఆదరణ పొందుతున్న ఆపరేషన్ అని బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఈస్తటిక్ ప్లాస్టిక్ సర్జన్స్ (BAAPS) పేర్కొంది. సౌందర్యం కోసం ఆపరేషన్ చేసుకుని ప్రాణాలు పోగొట్టుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.