Rare Genetic Condition : దేవుడు సృష్టించిన జీవుల్లో మానవునిది ఓ ప్రత్యేకమైన స్థానం. ఇతర ఏ జీవికి లేని తెలివి, శరీర నిర్మాణం మానువుని సొంతం. అయితే, కొన్ని కొన్ని సార్లు దేవుడి సృష్టిలో నిర్మాణ లోపాల కారణంగా మనిషికి కొన్ని జన్యుపరమైన లోపాలు వస్తూ ఉంటాయి. జన్యుపరమైన లోపాల కారణంగా ఆ మనిషి అష్ట కష్టాల పాలు కావాల్సి వస్తుంటుంది. సింగపూర్‌కు చెందిన ఓ పిల్లాడు అరుదైన జన్యుపర లోపం కారణంగా ప్రతీ రోజు నరకం అనుభవిస్తున్నాడు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్సులాగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిదంటే.. సింగపూర్‌కు చెందిన 10 ఏళ్ల పిల్లాడు డేవిడ్ అరుదైన జన్యులోపం ‘ప్రేడర్ విల్ సిండ్రోమ్’తో బాధపడుతున్నాడు.
ఈ లోపం కారణంగా అతడికి అతిగా ఆకలి అవుతోంది. ఎన్ని సార్లు తిన్నా, ఎంత తిన్నా మరు క్షణంలో ఆకలి అవుతూ ఉంటుంది. ఇందుకు కారణం లేకపోలేదు. సాధారణంగా మనం ఏదైనా తింటే.. మన పొట్ట అందుకు సంబంధించిన విషయాలను మెదడుకు చేరవేస్తుంది. అప్పుడు మనకు ఆహారం తిన్న భావన కలుగుతుంది. తక్కువ తింటే తక్కువ తిన్నట్లు.. ఎక్కువ తింటే పొట్ట నిండుగా అనిపిస్తుంది. అయితే, డేవిడ్ విషయంలో అలా జరగటం లేదు. అతడి పొట్ట ఆహారం తిన్నప్పటి విషయాలను మెదడుకు చేరవేయటం లేదు. దీంతో అతడికి ఎంత తిన్నా తినలేదన్నట్లు ఆకలిగా వేస్తోంది.
ఇక్కడో తలనొప్పి ఏంటంటే.. ఈ లోపాన్ని సరిచేయలేము. కానీ, ఈ లోపం కారణంగా వచ్చే లక్షణాలను, సమస్యలను తగ్గించవచ్చు. డేవిడ్ కుటుంబం అతడు ఎక్కువ ఆహారం తినకుండా ఉండటానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అయినా ఏం లాభం లేకపోయింది. ఇలా కాదని అనుకుని డేవిడ్ కోసం ఓ ప్రత్యేకమైన ఈటింగ్ షెడ్యూల్‌ను పెట్టారు. ఆ షెడ్యూల్ ప్రకారమే తినాలనే రూల్‌ను పెట్టారు. అంతేకాదు! ఆ వేళల్లో తప్ప మిగితా వేళల్లో తినకుండా ఉండటానికి వంట గదికి లాక్ కూడా వేస్తున్నారు. పాపం దేవుడు పెట్టిన లోపంతో పదేళ్ల బాలుడు చాలా కష్టపడుతున్నాడు. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.