అదృష్టం అంటే ఈ పైలట్‌దే అనాలి. చిన్న చిన్న ప్రమాదాల్లో కూడా ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది. కానీ అతడు మాత్రం వరుసగా ఏడు ప్రమాదాలకు గురైనా, బతికి బయటపడ్డాడు. ఆ పైలట్ స్టోరీ మీ కోసం..!
చిన్న చిన్న ప్రమాదాల్లో ఎంతో మంది గాయపడుతున్నారు. వారిలో కొందరు చనిపోవడం కూడా చూస్తున్నాం. కాలు జారి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ కొందరి విషయంలో మాత్రం ఎంత పెద్ద ప్రమాదాలు ఎదురైనా బతికి బయటపడతారు. అలాంటి వారికి భూమ్మీద నూకలు ఉన్నాయని సరదాగా అంటుంటారు. అమెరికాలోని మిషిగాన్‌కు చెందిన డెన్నిస్ కోలియర్ కూడా ఆ కోవలోకే వస్తాడు. వరుసగా ఏడు విమాన ప్రమాదాలైనా.. ఈ పైలట్ బయటపడ్డాడు. కోలియర్కు గతంలో పైలట్‌గా విమానాలు నడిపిన అనుభవం ఉంది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయనకు గాల్లో ఎగరాలనే కోరిక కలిగింది. 2021లో సొంతంగా విమానం కొనాలని నిశ్చయించుకున్నాడు.
విమానం కోసం కోలియర్ ఆన్లైన్లో వెతగ్గా.. దాదాపు రూ.కోటి ధరలో ఒక చిన్న విమానం కనిపించింది. దాన్ని వెంటనే కొనేశాడా పైలట్. కాలిఫోర్నియాలో ఉన్న ఆ విమానాన్ని తెచ్చుకునేందుకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక తెలిసింది ఏంటంటే.. అది మూలన పడ్డన పాత విమామని. అందులోని కొన్ని భాగాల అమరిక కూడా సరిగ్గా లేదు. రెక్కల మీద ఉండే ఫ్లాప్స్, టైల్ అడపాదడపా పనిచేస్తున్నాయి. అయినాసరే విమానాన్ని కొనాలని ఫిక్స్ అయ్యాడు కొలియర్. అదే అతడికి డేంజర్‌గా మారింది. ఆ విమానాన్ని నడుపుతూ ఏడు రోజుల్లో ఏడు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విమానాన్ని ఫస్ట్ టైమ్ నడుతున్నప్పుడు ల్యాండింగ్ గేర్ వేయడం మర్చిపోయాడు.
విమానం నడిపి అప్పటికి ఇరవై ఏళ్లు కావడంతో ల్యాండింగ్ గేర్ ఎలా వేయాలో మర్చిపోయాడు కోలియర్. దీంతో విమానం కింద భాగం నేలకు రాసుకుంటూ… గట్టిగా చప్పుడు చేస్తూ ఆగింది. మరోమారు ల్యాండింగ్ సమయంలో మూడు లైట్లను ఢీకొట్టాడు. ఎన్ని ప్రమాదాలైనా.. విమానానికి మరమ్మతులు చేసుకుంటూ ప్రయాణాలు చేస్తున్నాడు. గాల్లో అలాగే నీళ్ల మీదా ఎగిరే విమానం కావడంతో ఒకసారైతే వాటర్‌పై ల్యాండ్ చేశాడు. కానీ ఫ్లాప్స్ పనియేక విమానం నీళ్లపై వాలిపోయింది. దీంతో విమానం శిథిలాలపై ఎక్కి నిల్చున్నాడు కోలియర్. యూఎస్ కోస్ట్ గార్డ్స్ వచ్చి అతడ్ని రక్షించారు. ఇన్ని ప్రమాదాలు ఎదురైనా అతడి శరీరంపై చిన్న గీత కూడా పడలేదు. ఎక్కువ విమాన ప్రమాదాలు చేసిన కారణంగా కోలియర్ ఫ్లయింగ్ లైసెన్స్ కోల్పోయాడు. మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.