ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరగడం.. ప్రాణ నష్టం జరగడం చూస్తున్నాం. తాజాగా పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర పెరూలోని లిబర్టాడ్ రీజియన్‌లో ఓ బస్సు లోయలో పడిపోయింది. దీంతో సుమారు 20 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెళ్తున్న బస్సు లిబర్టాడ్ రీజియన్‌లో అదుపుతప్పి లోయలో పడిపోయింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పెరూ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: బరి తెగించిన ఓ తల్లి దారుణం! ఏకంగా కన్న కొడుకునే!
ఈ ప్రమాదం బస్సు నుజ్జునుజ్జయిందని, నాలుగేళ్ల చిన్నారితో సహా 20 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. కాగా, బస్సు తయాబాంబా నుంచి ట్రుజిల్లోకు ప్రయాణిస్తోండగా ఈ దుర్ఘటన జరిగిందనీ..సుమారు 100 మీటర్ల లోతైన లోయలోకి బస్సు పడిపోయిందని తెలిపారు. ఇక పెరూలో అతి వేగం, రోడ్లు సరిగా లేకపోవడం, ప్రమాద సూచికలు లేకపోవడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. 2020 నవంబర్ 10న ఉత్తర పెరూవియన్ జంగిల్‌లో ఇటువంటి ప్రమాదమే జరిగింది. ఓ మినీబస్సు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.