సహజంగా మనమెక్కిన బైక్ కానీ, డీసీఎం కానీ టైర్ ఫంక్చర్ అయినా లేక పేలిన మెల్లగా ఆపి నెట్టుకుంటు ముందుకు వెళ్తాం. అది సర్వసాధారణం. కానీ నేపాల్ లో ఏకంగా విమానం టైర్ పేలడంతో విమానంలో ఉన్న ప్యాసెంజర్స్ అంతా తలలు పట్టుకుని నెట్టడం మొదలు పెట్టారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. ఇక విషయం ఏంటంటే..? ఇటీవల నెపాల్ లో నెపాల్‌కు చెందిన తారా ఎయిర్‌లైన్స్ విమానం టైర్ పేలింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఏం చేయాలో తెలియక మెల్లగా ఆ విమానాన్ని రన్ వేపై దింపారు. ఇక ముందుకు వెళ్లేది ఎలా అని కాస్త మొదడుకు పని చెప్పారు. వెంటనే మైండ్ లో ఓ ఆలోచన వెలిగింది. అదేంటి అంటారా? ముందుగా అందులో ఉన్న ప్యాసెంజర్స్ అందరిని కిందకు దింపారు. ఆ తర్వాత అందులోని ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు సెక్యూరిటీ సిబ్బందితో విమానం వెనక నుంచి నెట్టే ప్రయత్నం చేశారు. దీనిని అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ వ్యంగ్యస్త్రాలతో కూడిన కామెంట్స్ చేస్తున్నారు.