సముద్రంలో హాయిగా విహరించడం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అలా సరదాగా ఎంజాయ్ చేద్దామని కొందరు ఓ క్రూయిజ్ షిప్ లో విహారానికి వెళ్లారు. కానీ, అక్కడ అనుకోని సమస్య తలెత్తింది. ఆ ఓడలో ఉన్న వారిలో కొందరికి అంతుచిక్కని వ్యాధి ఒకటి సోకింది.
క్రూయిజ్ షిప్ ప్రయాణం అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అలా ఎంతోమంది ఓ క్రూయిజ్ షిప్ ఎక్కి ప్రయాణానికి వెళ్లారు. కానీ వారిలో 300 మందికి ఓ అంతుచిక్కని వింత వ్యాధి సోకింది. ఈ ఘటన అమెరికాకు చెందిన ప్రిన్సెస్ క్రూయిసెస్ రూబీ ప్రిన్సెస్ షిప్ లో వెలుగుచూసింది. అక్కడి వారికి ఓ మిస్టరీ వ్యాధి సోకినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ వెల్లడించింది. ఈ రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు టెక్సాస్ నుంచి మెక్సికోకు ప్రయాణికులతో ప్రయాణం సాగించింది. ఈ ఓడలో మొత్తం 2,881 మంది వరకు ప్రయాణికులు ఉండగా.. దాదాపు 284 మంది వరకు అనారోగ్య సమస్యలకు గురయ్యారు. అలాగే 1,159 మంది సిబ్బందిలో 34 మందికి అంతు చిక్కని వ్యాధి సోకిందని తెలిపారు. మంగళవారం నాటికి క్రూయిజ్ లోని ప్రయాణికుల్లో 13 శాతం మంది వరకు వాంతులు, విరేచనాలతో అస్వస్థకు గురయ్యారు.
అయితే వారికి ఇలా ఎందుకు జరిగింది అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. టెక్సాస్ లోని గాల్వెస్టన్ పోర్టుకు చేరుకున్న సమయంలో ఆరోగ్య అధికారులు, నిపుణులు ఓడను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ క్రూయిజ్ లో వ్యాధి ప్రారంభం అయినప్పటి నుంచి సిబ్బంది శానిటైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. 202లో కోవిడ్ సమయంలో వందలాది మంది ప్రయాణికులు కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ ఓడను ఆస్ట్రేలియాలోని పోర్టులో నిలిపివేశారు. ప్రస్తుతం ఈ రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో ఈ వింత వ్యాధి ఎందుకు వచ్చింది? దీని ప్రభావం ఎంత వరకు ఉంటుంది? ఇంకా ఎవరికైనా ప్రయాణికుల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? అనే అంశాలపై వైద్యులు మాత్రమే కాదు.. ఆరోగ్య నిపుణులు కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
The CDC is investigating an outbreak aboard the Ruby Princess cruise ship that left more than 300 passengers and crew members sick. pic.twitter.com/5T2XL4WYRV
— TODAY (@TODAYshow) March 9, 2023