ప్రేమను వ్యక్తపరిచే విధానాల్లో ముద్దు అనేది ఓ అద్భుతమైన భావన. వెయ్యి మాటల్లో చెప్పలేని దాన్ని ఒక్కముద్దుతో ఎదుటి వ్యక్తికి తెలియజేయవచ్చు. అందుకే ముద్దు ఆరోగ్యకరం అని సైన్స్ చెబుతోంది. ప్రేమికులు కూడా ముద్దు పెట్టుకోవటానికి..
ముద్దు.. మన ప్రేమను వ్యక్తపరచటానికి ఓ పద్దతి. ఎక్కువగా ప్రేమికులు, భార్యాభర్తలు ముద్దుతో తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేస్తుంటారు. లాంగ్ డిస్టన్స్ లవ్‌లో ఉన్నవాళ్లు లేదా తమకిష్టమైన వారికి దూరంగా ఉన్నవాళ్లు.. ఫోన్ కాల్‌లోనో.. వీడియో కాల్‌లోనో స్క్రీన్‌ను ముద్దాడి సంతోషిస్తుంటారు. మరికొంతమంది వాట్సాప్‌లో ముద్దు సింబల్స్ పంపి సంతోషిస్తుంటారు. నెలల పాటు దూరంగా ఉండే వారు ఇలా చేయటం అన్నది ఓ ఇబ్బందికరమైన విషయం. ఎదుటి వారిని చేరుకోలేక.. దూరంగా ఉండలేక తెగ ఇబ్బందిపడిపోతూ ఉంటారు.
ఇలాంటి వారి కష్టాలను గుర్తించిన ఓ చైనా కంపెనీ ఓ సరికొత్త సృష్టికి తెరతీసింది. ఓ కొత్త పరికరాన్ని తయారు చేసింది. ఈ పరికరం ద్వారా ఎంత దూరంలో ఉన్నా సరే ఎదుటి వ్యక్తితో ముద్దులాడుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన ఓ కంపెనీ రిమోట్ కిస్ అనే పరికరాన్ని తయారు చేసింది. దీని ద్వారా ఎంత దూరం ఉన్నా మనం ముద్దులు పెట్టుకోవచ్చు. ఇందులో సిలికాన్ ద్వారా తయారు చేయడిన పెదాలు ఉంటాయి. వీటిని ఫోన్స్‌కు తగిలించుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించిన యాప్‌లో మన ముద్దును అప్‌లోడ్ చేయాలి. అది ఎదుటి వ్యక్తికి వెళుతుంది. వాళ్లు సిలికాన్ పెదాలను ముద్దాడితే సరిపోతుంది. దీనికోసం ఇద్దరూ యాప్ ద్వారా పేయిర్ అవ్వాలి.
ఇది కేవలం ఇంటర్‌నెట్ ద్వారానే పని చేస్తుంది. సెన్సార్స్ ద్వారా ఇది పనిచేయటం వల్ల ఆ సిలికాన్ లిప్స్‌ను కిస్ చేసినపుడు.. మనం నిజంగానే ఎదుటి వ్యక్తి ముద్దు పెట్టుకున్న భావన కలుగుతుంది. ఈ పరికరం ప్రస్తుతం చైనాలోని ఆన్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది. దీని ధర ఇండియన్ కరెన్సీలో 3 వేల రూపాయలు. మీరు కూడా దూరంగా ఉన్న మీకిష్టమైన వాళ్లును ముద్దు పెట్టుకోవాలనుకుంటే ఈ పరికరాన్ని కొనేయండి. మరి, చైనా తయారు చేసిన రిమోట్ కిస్ అనే పరికరంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.