తన బిడ్డకు పురుగుల ఆహారం పెట్టడానికి డిసైడ్ అయింది. ప్రతి రోజూ పిల్లాడి ఆహారం పురుగుల్ని పెట్టడం చేస్తోంది. ఇది మీడియా దృష్టికి వచ్చింది. మీడియా ఆమెను ప్రశ్నించగా ఓ విచిత్రమైన సమాధానం చెప్పింది.
ఏ తల్లి అయినా తాను తిన్నా.. తినకపోయినా బిడ్డలకు తిండి ఉంటే చాలనుకుంటుంది. పిల్లల కడుపు నింపటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. పిల్లల ఆరోగ్యం విషయంలో ఎక్కడ రాజీ పడదు. ఇది సగటు తల్లి ఆలోచనా విధానం. కానీ, కెనడాకు చెందిన ఓ తల్లి మాత్రం భిన్నంగా ఆలోచించింది. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని భావించి తన బిడ్డకు పురుగులు పెడుతోంది. తన బిడ్డకు పురుగులు పెట్టడానికి ఓ కారణం కూడా చెబుతోంది. ఆ కారణం ఏంటి? ఆ తల్లి తన బిడ్డకు పురుగుల భోజనం పెట్టడం వెనుక అంత పెద్ద కారణం ఉందా? అన్నది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
కెనడాలోని టొరెంటోకు చెందిన ఆథర్ టిఫనీ లే అనే మహిళకు 18 నెలల ఓ బాబు ఉన్నాడు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగటంతో ఆమె ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. తన పిల్లాడి డైట్లో ఓ పెద్ద మార్పు చేసింది. ప్రోటీన్ ఫుడ్ ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి స్థానంలో కీచురాళ్లు బాబుకు పెట్టాలని డిసైడ్ అయింది. ఇక అప్పటినుంచి ప్రతీ రోజు తన బాబుకు కీచురాళ్లను ఆహారంలో పెడుతూ వస్తోంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి మీడియా దృష్టికి వెళ్లింది. దీనిపై మీడియా ఆమెను ప్రశ్నించగా.. ‘‘ నేను ఆహారానికి సంబంధించిన ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. నేను అన్ని రకాల ఆహార పదార్థాలను రుచి చూస్తూ ఉంటాను. ఆఖరికి పురుగులను కూడా తింటూ ఉంటాను. కాల్చిన తేళ్లను కూడా తిన్నాను.
ప్రొటీన్ సప్లిమెంట్ల ధరలు పెరగటంతో మా బాబుకు కీచురాళ్లు పెట్టాలని డిసైడ్ అయ్యాను. కీచురాళ్ల ప్రొటీన్ పౌడర్.. వేయించిన కీచురాళ్లు నా బాబుకు పెడుతున్నా. ఇలా చేయటం ద్వారా వారానికి 8 వేల రూపాయల ఖర్చు తగ్గింది. గతంలో వారానికి 25 వేల రూపాయలు ఖర్చు అయ్యేది. నా బాబు ఎలాంటి ఆహారాన్ని అయినా ఇష్టంగా తింటాడు. సర్టిఫైడ్ పిడియాట్రిషియన్ డైటేషియన్ వెనస్ కలామీ ప్రకారం.. 6 నెలల పిల్లలకు కూడా పురుగుల్ని తినిపించొచ్చు. ఇలా చేయటం ద్వారా పురుగులు కూడా తమ ఆహారం అని పిల్లలు ఫీలవుతారు’’ అని చెప్పుకొచ్చింది. మరి, ఖర్చులు తగ్గించుకోవటానికి పిల్లాడికి కీచురాళ్లు పెడుతున్న ఈ తల్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.