ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలిస్తే.. మన వాళ్ళు ఇప్పుడు వాళ్ళని పాలిస్తున్నారు. రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యాక వినిపిస్తున్న మాట ఇదే. భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానిమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 200 ఏళ్లు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు సింహాసనాన్ని మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అధిష్టించారు. విధి ఆడే వింత నాటకం అంటే ఇదేనేమో. కర్మ రిటర్న్ గిఫ్ట్ అంటే ఇదేనేమో. అయితే భారతీయుల్ని హింసించిన బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి రాముడిలా సుపరిపాలనే ధ్యేయంగా పని చేస్తారన్న నమ్మకం ఉంది.
ఎందుకంటే భారత్ అంటే రాముడి నడిచిన నేల, కృష్ణుడు గీచిన గీత, అగ్నిపునీత సీత.. ధర్మం, విలువలు, నీతి, నిజాయితీ వంటివి ఇన్బిల్ట్ ఉంటాయి. ఇన్నాళ్లు క్వీన్ ఎలిజబెత్ పరిపాలించిన బ్రిటన్ ను ఇప్పుడు రిషి సునాక్ పరిపాలిస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారతీయులు ఏ దేశంలో అయినా జెండా ఎగరేసే అవకాశం ఉంది కానీ భారతదేశం అంటే ఒకప్పుడు చులకన భావం ఉన్నటువంటి దేశంలో ప్రధాని అవ్వడం అనేది గొప్ప విషయమే. భారతదేశం పట్ల గౌరవం చూపించిన బ్రిటన్ వాసులు కూడా గొప్ప వాళ్ళే. అయితే రిషి సునాక్ ఒక్కరే కాదు, ఆయనలా మరి కొంతమంది వివిధ దేశాలను ఏలుతున్నారు. ప్రెసిడెంట్లుగా, వైస్ ప్రెసిడెంట్లుగా ఆయా దేశాలను ఏలుతున్న భారతీయ లెజెండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రిషి సునాక్ లా వీళ్ళు కూడా భారతీయ సంతతికి చెందిన, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులుగా విదేశీ వాళ్ళని రూల్ చేస్తున్నారు. విదేశీయులని రూల్ చేయడం ఒక ఎత్తు అయితే, భారతీయ మూలాలు ఉన్న వీళ్ళ మీద నమ్మకం ఉంచి ఎన్నుకోవడం మరొక ఎత్తు. ఏది ఏమైనా గానీ మన దేశ మూలాలు కలిన వ్యక్తులు ఇలా ప్రపంచమంతా శాసిస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇలానే కొనసాగితే ఏదో ఒకరోజు భారత్ ‘విశ్వగురు భారత్’ గా ఎదుగుతుంది. జయహో భారత్. భారత్ మాతాకీ జై.