ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రమాదాలు చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. ప్రమాదం లేని చోటంటూ లేదు. అభం శుభం తెలియని పసి పిల్లలు చదువుకునే బడికి కూడా ప్రమాదం గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. హెలికాప్టర్ రూపంలో ప్రమాదం వచ్చింది. ఇద్దరు పసి పిల్లలను ఆ ప్రమాదం మింగేసింది. హెలికాప్టర్ లో ఉన్న మనుషులు కూడా చనిపోయారు. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో వెళ్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. పిల్లలు చదువుకుంటున్న నర్సరీ స్కూల్ దగ్గర హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. ఒక్కసారిగా హెలికాప్టర్ నుంచి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో హోం మంత్రి సహా పలువురు కేబినెట్ మంత్రులు దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉక్రెయిన్ దేశ రాజధాని అయిన కీవ్ వద్ద బ్రోవరీ నగర శివారులోని నర్సరీ స్కూల్ ఉంది. ఈ నర్సరీ స్కూల్ భవనం వద్ద రాజకీయ నాయకులతో వెళ్తున్న హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో మొత్తం 16 మంది దుర్మరణం చెందారు. అంతర్గత వ్యవహారాల మంత్రి సహా ఇతర కేబినెట్ మంత్రులు కూడా మృతి చెందారు. మృతుల్లో హోం మంత్రి, డిప్యూటీ హోంమంత్రి, విదేశాంగ మంత్రి, పలువురు మంత్రులు ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. ఈ ఘటనలో 22 మందికి గాయాలయ్యాయి. పది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి డెనీస్ మోనాస్టైర్స్కై మరో 8 మందితో హెలికాప్టర్ లో ఉన్నారు.
డెనీస్ మొదటి డిప్యూటీ మినిస్టర్, స్టేట్ సెక్రటరీ కూడా మరణించారని అధికారులు వెల్లడించారు. బ్రోవరీ నగర శివారులో హెలికాప్టర్ కిందకు వచ్చేటప్పటికే వీళ్ళు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ హెలికాఫ్టర్ ఉక్రెయిన్ యొక్క అత్యవసర సేవలకు చెందినదని.. ఉక్రెయిన్ దేశ పోలీసు అధికారి ఇహోర్ కలిమెంకో తెలిపారు. అయితే రిపోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం.. హెలికాప్టర్ నర్సరీ దగ్గరకు చేరుకోగానే క్రాష్ కి గురయ్యింది. వెంటనే హెలికాప్టర్ నుంచి మంటలు చెలరేగాయి.
🇺🇦🚁🔥💥Ukrainian helicopter fell on a kindergarten
This was stated in the Ministry of Internal Affairs of Ukraine. At the moment, 5 victims are known.Footage of fire where the Ukrainian helicopter fell pic.twitter.com/g7TwiczUJ3
— AZ 🛰🌏🌍🌎 (@AZgeopolitics) January 18, 2023
పాఠశాలలో ఉన్న పిల్లలు, సిబ్బంది భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. మంటలు వ్యాపించడంతో భవనం కాలిపోయింది. కాలిన భవనం బయట హెలికాప్టర్ నుంచి శిధిలాలు కనిపించాయి. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో వాతావరణం చీకటిగా, పొగమంచుతో కనిపించకుండా ఉందని స్థానికులు చెబుతున్నారు. హెలికాప్టర్ నర్సరీ స్కూల్ భవనాన్ని ఢీ కొనడం వల్లే క్రాష్ అయ్యిందని చెబుతున్నారు. ఈ ఘటనలో 22 మంది గాయపడగా.. వీరిలో 10 మంది పిల్లలు ఉన్నారు. వీళ్లందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కలిమెంకో వెల్లడించారు.
🇺🇦🚁🔥A kindergarten destroyed as a result of a helicopter crash pic.twitter.com/WZx2Bk5ArN
— AZ 🛰🌏🌍🌎 (@AZgeopolitics) January 18, 2023