ఈ మధ్య కాలంలోని యువతి యువకులు దాదాపుగా అందరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. పార్క్ లు, రెస్టారెంట్ లు అంటూ ఎక్కడపడితే అక్కడ వాళ్లే కనిపిస్తుంటారు. అయితే కొందరు యువకులు మాత్రం వారిని చూసి అసూయతో మాకు గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసమే ఓ యాప్ తయారు చేశారట. మీరు విన్నది నిజమే. ఇక్కడేనా అంటూ కాస్త తొందరపడకండి.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనాలో లవర్ లేకుండా బాధపడుతున్నవారి కోసం అద్దెకు గర్ల్ ఫ్రెండ్ ఇచ్చే ఓ విన్నూత్నమైన ఆలోచనతో యాప్ చేశారట. ఇక యువకులకు లవర్ ని అద్దెకిచ్చే క్రమంలో దాదాపుగా రూ.34 వేల నుంచి లక్ష వరకు ఖర్చవుతుందట. ఇక గర్ల్ ఫ్రెండ్ ను అద్దెకిచ్చే క్రమంలో కండిషన్స్ అప్లై అంటూ ఓ కండిషన్ పెట్టారు.
లవర్ ని ఎక్కడికైన తీసుకెళ్లొచ్చు కానీ ఆమెను ముట్టుకోవటానికి వీళ్లు లేదట. గర్ల్ ఫ్రెండ్ ని డేటింగ్, పార్క్ ఇలా ఎక్కడికైన తీసుకెళ్లే విధంగా ఈ యాప్ ను రూపొందించారు. మరి ఈ యాప్ ఎంత వరకూ సక్సెస్ అవుతుందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక చైనా రూపొందించిన ఈ యాప్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.