Swap Oil For Beer Offer: పూర్వం ‘శ్రీ కృష్ణ దేవరాయలు’ కాలంలో.. డబ్బులు అందుబాటులో లేని టైంలో.. కావాల్సిన వస్తువులను పొందటానికి ఓ పద్దతి ఉండేది. ఓ వ్యక్తి దగ్గర ఉన్న వస్తువును వేరే వ్యక్తికి ఇచ్చి.. ఆ వ్యక్తి దగ్గర ఉన్న వస్తువును వీళ్లు తీసుకునేవారు. ఎలాగంటే.. మీ దగ్గర పల్లీలు ఉన్నాయి.. మీకు తెలిసిన వ్యక్తి దగ్గర కందిపప్పు ఉంది. అప్పుడు మీరు ఆ వ్యక్తికి పల్లీలు ఇచ్చి, కంది పప్పు పొందొచ్చు. దీన్నే ‘బార్టర్’ పద్దతి అంటారు. తెలుగులో వస్తు మార్పిడి పద్దతి అంటారు. డబ్బులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పద్దతి పోయింది.
అయితే, ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా మళ్లీ ఈ వస్తు మార్పిడి పద్దతి తెరపైకి వచ్చింది. ఈ బార్డర్ పద్దతిని తీసుకువచ్చింది ప్రజలు కాదు.. ఓ పబ్బు. ఇంతకీ సంగతేంటంటే.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా జర్మనీలో వంట నూనె కొరత ఏర్పడింది. 30 లీటర్లు అవసరమున్న వారికి దానిలో సగం.. 15 లీటర్ల వంట నూనె మాత్రమే లభిస్తోంది. ఈ కొరతను అధికమించటానికి జర్మనీ దేశంలోని మునిచ్ సిటీలో ఉన్న ‘గీయ్‌సింగర్ బ్రీవరీ, ఏ బ్రీవ్ పబ్’ ఓ వినూత్న ఆలోచన చేసింది.
పూర్వపు రోజుల్లో అందుబాటులో ఉన్న బార్టర్ పద్దతిని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. తమ పబ్‌కు వచ్చే కస్టమర్లు ఓ లీటర్ పొద్దు తిరుగుడు గింజెల నూనె ఇస్తే.. దానికి ప్రతిగా ఓ లీటర్ బీరును అందిస్తోంది. జర్మనీలో లీటర్ పొద్దు తిరుగుడు గింజెల నూనె ధర 4.5 యూరోలు ఉండగా.. లీటర్ బీరు ధర 7 యూరోలుగా ఉంది. అంటే.. కస్టమర్లకు రెండున్నర యూరోలు లాభం అన్నమాట.
ఒకరకంగా చెప్పాలంటే సగం ధరకే బీర్ వస్తోంది. దీంతో కస్టమర్లు వంటనూనెతో పబ్‌కు ఎగబడ్డారు. ఇలా దాదాపు 400 లీటర్ల వంట నూనె పబ్‌కు చేరింది. అయితే, ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. 2022, జులై చివరకు ఈ ఆఫర్ పూర్తికానుంది. మరి, జర్మన్ పబ్ ప్రవేశ పెట్టిన ఈ బార్టర్ పద్దతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Delivery Boy: ప్రాణాలకు తెగించి ఐదుగురిని కాపాడిన పిజ్జా డెలివరీ బాయ్!