విమానయనం అందుబాటులోకి వచ్చాక ఒక దేశం నుంచి మరో దేశానికి కొన్ని గంటల్లోనే చేరిపోతున్నాం. దాంతో ఎంతో సమయం కలిసివస్తోంది. అయితే అప్పుడప్పుడు విమానాలు ఆలస్యం అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ మాత్రం పైలట్ల సమ్మె కారణంగా ఏకంగా 800 విమానాలను రద్దు చేస్తున్నట్లు ఓ సంస్థ ప్రకటించింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
జీతాలు పెరగాలని ఉద్యోగులు సమ్మెలు చేయడం సహజమే. అయితే కొన్ని సంస్థల్లో ఇలా సమ్మెలు చేస్తే ఆ ప్రభావం దేశం మెుత్తం పడుతుంది. ప్రస్తుతం అలాంటి సమస్యనే జర్మనీ ఎదుర్కొంటోంది. తాజాగా జర్మనీ విమానయాన సంస్థ అయిన లూఫ్తాన్సా ఎయిర్ లైన్స్ తన ఆధీనంలో ఉన్న800 ప్యాసింజర్, కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు సంస్థ గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దానికి సంబంధించి కారణాలను సైతం వెల్లడించింది.
లూఫ్తాన్సా గ్రూప్ కు చెందిన పైలట్లు తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ యూనియన్ మెుత్తం శుక్రవారం విధులను బహిష్కరించారు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. విమానాల రద్దుతో దాదాపు 1.30 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం చూపుతుందని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో పైలట్లు ఈ సంవత్సరం తమకు 5.5% జీతాలను పెంచాలని ప్రతిపాదించగా యాజమాన్యం మాత్రం సీనియర్ పైలట్లకు 5 శాతం, జూనియర్లకు 18 శాతం పెంచుతామని తెలిపింది. ఈ ప్రతిపాదనను యూనియన్ తిరస్కరించింది. దాంతో సమ్మె ప్రారంభం అయ్యింది.
ఈ ప్రభావం భారత్ పై కూడా పడింది. ఇండియా నుంచి ఫ్రాంక్ ఫర్డ్, మ్యూనిచ్ కు వెళ్లాల్సిన రెండు విమానాలు కూడా రద్దు చేసింది లూఫ్తాన్సా సంస్థ. దాంతో సుమారు 150 మంది ప్రయాణికుల ఇబ్బందులు గురి అయ్యారు. వారి బంధువులతో కలిసి తమకు డబ్బులు వాపస్ చేయాలని లేదా ప్రత్యమ్నాయం చూపాలని విమానాశ్రయం ముందు ఆదోళనలు చేపట్టారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. మరి ఈ సమ్మె పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Lufthansa Pilots Begin Strike Friday, May Cancel 800 Flights
Vereinigung Cockpit is demanding a 5.5% pay rise this year, for its more than 5,000 pilots. https://t.co/NGnmoHKDyG pic.twitter.com/L4ZJwqz2WE— ARISE NEWS (@ARISEtv) September 2, 2022