దీనిపై వైద్యులు స్పందించారు. జన్యుపరమైన లోపలవల్లనే ఈ విధంగా జన్మిస్తాయని తెలిపారు. ఆరు కాళ్ళు, రెండు తలలతో గతంలో చాలా మేకలు జన్మించాయని, కానీ అవి కొద్దీ గంటల తర్వాత మృతి చెందాయని ఇది మాత్రం పెరిగి పెద్దదైందని వివరించారు. జన్యులోపం అనేది సర్వసాధారణ విషయమని పేర్కొన్నారు.



ముస్లింలు ఎక్కువగా జరుపుకునే పండుగ బక్రీద్. ఆ పండుగ రోజున గొర్రెను బలి ఇస్తుంటారు. ప్రపంచంలో ఆ రోజుల గొర్రెల కొనుగోలు ఆమ్మాకాలు అధికంగా జరుగుతుంటాయి. అయితే, నైజీరియాలోని లాగోస్ మార్కెట్‌కు ఓ వ్యక్తి గొర్రెను అమ్మేందుకు తసుకొచ్చారు. బక్రీద్ నేపథ్యం నైజీరియాలోని లాగోస్‌లోని ఓ మార్కెట్‌లో గొర్రెల విక్రయం జోరుగా సాగింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తీసుకొచ్చిన గొర్రె అందరినీ ఆకట్టుకుంది. సాధారణంగా గొర్రెకు రెండే కొమ్ములు ఉంటాయి. అయితే, ఆ గొర్రెకు మాత్రం ఐదు కొమ్ములు ఉండటంతో దాన్ని వింతగా చూశారు.














