ఇంటర్నెట్ సెన్సేషన్, మీమర్స్ కు ఎంతో ఇష్టమైన మీమ్ డాగ్ కబోసు అస్వస్థతకు గురైంది. క్రిప్టో కరెన్సీ డాజ్ కాయిన్ ఫేస్ కూడా ఈ కబోసు అని చాలా మందికి తెలుసు. ఈ వరల్డ్ ఫేమస్ డాగ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 2010లో ఈ కబోసు పేరిట డాజ్ మీమ్ కూడా స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇంటర్నెట్ లో ఎక్కడ చూసిన కబోసు పిక్స్ కనిపిస్తూ ఉండేవి. ఈ కబోసు వయసు దాదాపుగా 17 సంవత్సరాలని చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే తన 17వ పుట్టినరోజును జరుపుకున్నట్లు నెట్టింట పోస్టులు వచ్చాయి.
ఇప్పుడు ఈ కబోసు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని అంతా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కబోసు ఎలా ఉందో దాని యజమాని అయిన కిండర్ గార్డెన్ టీచర్ అటుసోకు శాటో ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. కబోసు ఆరోగ్యం అసలు బాలేదు. ఈ క్రిిస్మస్ ని మీరు ఎడిట్ చేసే ఫొటోలతో మేము ఆనందంగా జరుపుకుంటాం. అయితే మీరు బయపడాల్సిన అవసరం లేదు. కబోసు ఆరోగ్యం కచ్చితంగా మెరుగవుతుందని ఫ్యాన్స్ కు ధైర్యం చెప్పారు. డాజ్ కాయిన్ సహ రూపకర్త బిల్లీ మార్కస్ కూడా కబోసు ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. తన 2 మిలియన్ ఫాలోవర్స్ ని కబోసు కోసం ప్రే చేయాలని, తమ బ్లెస్సింగ్స్ పంపాలంటూ ట్విట్టర్ వేదికగా కోరుకున్నాడు.
doge (kabosu) is sick 🙁 please send her and @kabosumama your ❤️ and 🙏 and good vibes ~ pic.twitter.com/8IqnYWFhWN
— Shibetoshi Nakamoto (@BillyM2k) December 26, 2022
అయితే ఈ ఫేమస్ డాగ్ కబోసుకు వచ్చిన అనారోగ్యం ఏంటి? ఏ జబ్బుతో కబోసు బాధపడుతోంది అని మాత్రం చెప్పలేదు. కానీ, తన పోస్టులో మాత్రం కబోసు ఏమీ తినడంలేదు, తాగడం లేదని చెప్పుకొచ్చింది. తాము ఆస్పత్రికి వెళ్తున్నట్లు ఆరోగ్యంగా తిరిగివస్తామంటూ ఫ్యాన్స్ కు హామీ ఇచ్చారు. డాజ్ మీమ్ ని సరదాగా క్రియేట్ చేసినా కూడా మీమర్స్ ప్రపంచంలో తిరుగులేని స్టార్ గా కబోసు ఎదిగింది. అలాగే క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో డాజ్ కాయిన్ ఎంతో పాపులర్. క్రిప్టో ప్రపంచంలో 10.4 బిలియన్ క్యాపిటలైజేషన్ తో 8వ అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా ఉంది. అలాగే బిట్ కాయిన్ తర్వాత గూగుల్ ఎక్కువగా సెర్చ్ చేసే క్రిప్టో కరెన్సీ డాజ్ కాయిన్ కావడం విశేషం.
The famous dog Kabosu, who became the hero of the DOGE meme, is seriously ill and may soon die. pic.twitter.com/Cxbl5QqqbB
— NEXTA (@nexta_tv) December 27, 2022