ఇప్పుడున్న సాంకేతికత 50 ఏళ్ల క్రితం అందుబాటులో లేదు. దాంతో ఆ కాలంలో సంభవించిన అనేన నేరాలు మిస్టరీలుగా ఉండిపోయాయి. అయితే కొన్నికేసులు తాజాగా పరిష్కారం అవుతున్నాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
చరిత్రలో పరిష్కారం కాకుండా నిలిచిపోయిన కొన్ని కేసులు.. అనుకోని రీతిలో.. అనూహ్యంగా చిన్న క్లూతో సాల్వ్ అవుతాయి. ఆ నిమిషం పనికిరాని వస్తువులుగా కనిపించినవి.. మిస్టరీలను సాల్వ్ చేయడంలో కీలకంగా మారతాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. 52 సంవత్సరాలుగా మిస్టరీగా ఉన్న హత్య కేసు.. చిన్న సిగరెట్ పీకతో సాల్వ్ అయ్యింది. అది ఎలానో తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అయితే హత్యా నేరం చేసిన వ్యక్తి ప్రస్తుతం మృతి చెందాడు. మరి కేసు ఎలా సాల్వ్ అయ్యిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
ఈ సంఘటన 1971, జూలై 19న చోటు చేసుకుంది. రీటా కరన్(24) అనే యువతి వర్‌మోంట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేసేది. సుమారు 52 ఏళ్ల క్రితం అనగా 1971, జూలై 19 రాత్రి తన గదిలో దారుణంగా హత్యకు గురై కనిపించింది. కరన్ రూమ్మేట్ గదికి వచ్చి చూసే సరికి ఆమె శవం రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు.. రూమ్ మొత్తం గాలించారు. వారికి కాల్చి పడేసని సిగరెట్ పీక తప్ప ఇంకేం ఆధారాలు లభించలేదు. ఈ క్రమంలో పోలీసులు కరన్ అపార్ట్‌మెంట్ పైన ఉంటున్న భార్యాభర్తలు డీరూస్, మైకెల్‌ను పిలిచి విచారించారు. తాము ఇంటి నుంచి బయటకు వెళ్లలేదని.. కరన్ రూమ్ నుంచి ఎలాంటి శబ్ధాలు వినిపించలేదని తెలిపారు. దాంతో పోలీసులు వారిని పంపించారు.
సంఘటన స్థలంలో దొరికిన సిగరెట్‌ని పీకను ఆధారాల జాబితాలో చేర్చారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్నంత సాంకేతికత నాడు అందుబాటులో లేకపోవడం కూడా దీనికి ఒక కారణం అని చెప్పవచ్చు. కేసు మిస్టరీగా మిగిలింది. అయితే 2014లో కరన్ హత్య గావించబడినప్పుడు దొరికిన సిగరెట్ పీకను డీఎన్‌ఏ టెస్ట్‌కి పంపించారు. రిజల్ట్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే తాము అనుమానించి.. ఆ తర్వాత వదిలేసిన వ్యక్తే రీనా కరన్‌ను హత్య చేశాడు. అతడే డీరూస్.
సిగరెట్ పీక మీద ఉన్నడీఎన్‌ఏ శాంపిల్.. కరన్ హత్యకు గురైన రోజున ఆమె ధరించిన జాకెట్ మీద లభించిన డీఎన్‌ఏతో సరిపోలింది. డీరూస్‌ది గుర్తించారు పోలీసులు. దాంతో కరన్ హత్యకు గురైన 50 ఏళ్ల తర్వాత పోలీసులకు కేసులో కీలక సాక్ష్యం లభించింది. డీరూస్ కోసం గాలించడం ప్రాంరభించారు. ఈ క్రమంలో అతడి భార్య మైకెల్ అడ్రెస్ సంపాదించారు. అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే డీరూస్ మృతి చెందినట్లు తెలిసింది. ఇక కరన్ మృతి గురించి ప్రశ్నించగా.. డీరూస్ భార్య అసలు వాస్తవాలు వెల్లడించింది.
కరన్ హత్య జరిగిన రోజున తనకు, డీరూస్‌కు మధ్య గొడవ జరిగిందని.. ఆ తర్వాత అతడు బయటకు వెళ్లాడు. ఏం జరిగిందో తెలియదు.. కరన్‌ను కత్తితో హత్య చేశాడు. తర్వత గదికి వచ్చి.. దీని గురించి తనకు చెప్పాడని తెలిపింది మైకెల్. అంతేకాక ఈ హత్య గురించి పోలీసులకు చెబితే.. తనను కూడా చంపేస్తానని బెదిరించాడని.. అందుకే తాను అబద్ధం చెప్పానని పోలీసులకు తెలిపింది.
ఇక డీరూస్ కరన్‌ని హత్య చేసిన తర్వాత డీరూస్ థాయిల్యాండ్ పారిపోయి బౌద్ధ సన్యాసిగా మారాడు. 1974లో తిరిగి శాన్‌ఫ్రాన్సిస్కోకి వచ్చాడు. ఆ తర్వాత 1989లో డ్రగ్స్ అధిక మొత్తంలో తీసుకోవడంతో మృతి చెందాడు. మొత్తానికి కాల్చి పడేసిన సగం సిగరెట్ పీక ద్వారా 52 ఏళ్ల మర్డర్ కేసు మిస్టరీ వీడింది.