అనుమతి లేకుండా అమ్మాయిని తాకడం నేరం. అయితే ఈ తాకడానికి సమయాలు ఉంటాయని.. పలానా టైం గ్యాప్ లో తాకితే తప్పు కాదట. మామూలుగా తాకడం కూడా కాదు.. ప్రైవేట్ పార్ట్స్ ని తాకడం. ఇదసలు తప్పే కాదట. వ్యక్తి చెప్పిన మాట కాదు ఇది. ఒక కోర్టు చెప్పిన మాట.
‘ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే తీయాల్సింది వేలు కాదు, తల’ అని బాహుబలిలో ప్రభాస్ చెప్పినట్టు.. అమ్మాయి మీద అత్యాచారం చేసిన వాడిని ఉరి తీయాలని ప్రజలు అంటారు. అత్యాచారమే కాదు అమ్మాయిని లైంగికంగా వేధించినా కూడా కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తారు. అలాంటిది కోర్టు లైంగిక వేధింపుల కేసులో అమ్మాయిని తాకిన అబ్బాయిది తప్పు కాదు అని తీర్పు ఇచ్చారు. పైగా లైంగిక వేధింపులు తక్కువ సమయం చేస్తే అది నేరం కాదని కోర్టు సెలవిచ్చింది. దీంతో కోర్టు తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి తీర్పు అంటూ మండిపడుతున్నారు. కోర్టు తీరుకు నిరసనగా సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
ఇటలీలోని రోమ్ నగరానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటుంది. అయితే ఈ స్కూల్లో పని చేసే 66 ఏళ్ల ఆంటోనియో అవోలా అనే కేర్ టేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్నేహితురాలితో కలిసి స్కూల్లో మెట్లు ఎక్కుతుండగా కేర్ టేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. విద్యార్థిని ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం.. లోదుస్తులను లాగడం వంటివి చేసేవాడని, అయితే తాను సీరియస్ గా చూడడంతో సరదాగా చేశానని చెప్పేవాడని తెలిపింది. పోలీసులు ఆంటోనియోపై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం స్థానిక కోర్టులో హాజరు పరిచారు.
అయితే తాను తాకడం నిజమే అని, సరదాగా చేశానని ఆంటోనియో కోర్టు ముందు చెప్పుకొచ్చాడు. వాదోపవాదనలు విన్న కోర్టు ఇచ్చిన తీర్పు వివాదానికి దారి తీసింది. ఆంటోనియో ఈ పనిని కామవాంఛతో చేయలేదని.. సరదాగా చేసినట్లు మేము అంగీకరిస్తున్నామని పేర్కొంది. అంతేకాదు.. బాలికను అతను కేవలం 5 నుంచి 10 సెకన్ల లోపు మాత్రమే తాకాడు కాబట్టి ఇది నేరం కాదని.. అలా పరిగణిస్తే అనాలోచితమే అని కోర్టు వ్యాఖ్యానిస్తూ కేసును కొట్టి వేసింది. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియాలో #10secondi పేరుతో వీడియోలను షేర్ చేస్తున్నారు. 5 నుంచి 10 సెకన్ల లోపు ఆడవారి ప్రైవేట్ పార్ట్స్ ని తాకుతున్న వీడియోలను షేర్ చేస్తున్నారు. అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి కోర్టు తీర్పుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
🇮🇹ローマの高校の男性用務員(66)が、女子生徒(17)のズボンをずり下げ尻を触り下着を掴む事件発生
↓
👨「確かに下半身をまさぐったけど冗談のつもりだった」
↓
性的暴行罪に問われるも、裁判所が『触ったのが10秒未満なのでセーフ』というトンデモ判決を下し無罪に
↓#10secondi(10秒)がトレンド入り pic.twitter.com/XdFPx33QLK— 滝沢ガレソ🥕 (@takigare3) July 15, 2023