కోరనా వైరస్ పుట్టుకకు కారణం చైనా ప్రయోగమేనని గత కొన్నేళ్లుగా అమెరికా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చైనాకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, అందుకు సరైన ఆధారాలు లభించకపోవటంతో..
కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయం ఎప్పటికీ మరవలేం. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం గిలగిల్లాడిపోయింది. లాక్‌డౌన్ విధించుకుని నాలుగు గోడల మధ్య నలిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. భారత దేశంలో కూడా లక్షల మంది చనిపోయారు. ఆర్థికంగా కూడా ప్రపంచం నాశనం అయింది. ఎంతో మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. తినడానికి తిండి లేక ప్రాణాలు తీసుకున్నారు. అయితే, కరోనా కారణంగా ఎక్కువ నష్టపోయిన దేశం అమెరికా. ఒక్క అమెరికాలోనే కోటి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ తల్లకిందులు అయింది. జన జీవనం స్తంభించిపోయింది. తమ దేశం ఇంతలా కష్టాల పాలు కావటానికి చైనానే కారణమని గత కొన్నేళ్లుగా అమెరికా ఆరోపిస్తూ వస్తోంది.
కరోనా వైరస్ ఊహాన్‌లోని ఓ ల్యాబ్‌లో జరిగిన ప్రయోగాల కారణంగా పుట్టిందని అంటూ వస్తోంది. అయితే, అమెరికా ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోవటంతో అవి ఆరోపణలగానే మిగిలిపోయాయి. అయితే, కరోనా ఒకరకంగా పూర్తిగా కనుమరుగైన ఈ సమయంలో అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) డైరెక్టర్ క్రిష్టోఫర్ రే బుధవారం సంచనల వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఊహాన్‌లోని ల్యాబ్‌లోనే పుట్టిందని అన్నారు. ఎఫ్‌బీఐ జరిపిన దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు. కరోనా పుట్టుకను తెలుసుకోవటానికి అమెరికా, సన్నిహిత దేశాలు చేస్తున్న ప్రయత్నాన్ని చైనా ప్రభుత్వం అడ్డుకోవటానిని చూస్తోందని పేర్కొన్నారు. అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ కూడా దీనిపై దర్యాప్తు చేసింది.
ఎఫ్‌బీఐ వాదనలతో ఎనర్జ డిపార్ట్‌మెంట్ ఏకీభవిస్తోందని ఆయన వెల్లడించారు. కాగా, తన శత్రు దేశాలను నాశనం చేయటానికే చైనా కరోనా వైరస్‌ను తయారు చేసిందని, కరోనా వైరస్ ఊహాన్‌లోని ల్యాబ్ తయారు చేయబడిందన్న వాదనలు ఉన్నాయి. ఊహాన్ ల్యాబ్‌లో జరిగిన ఓ ప్రయోగం వికటించటం కారణంగా కరోనా వైరస్ పుట్టిందన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే, వాటిపై ఎలాంటి స్పష్టత, అధికారిక ధ్రువీకరణలు లేవు. మరి, కరోనా వైరస్ ఊహాన్ లాబ్‌లోనే పుట్టిందన్న ఎఫ్‌బీఐ చీఫ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.