ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాలు ఏవి అంటే మొదటి స్థానంలో చైనా, తరువాతి స్థానంలో భారత దేశం ఉంటాయి. అయితే జనాభా నియంత్రణ కోసం కొన్నేళ్ల పాటు చైనా ఒక్కరు ముద్దు అసలే వద్దు నియమాన్ని పాటించింది. ఫలితంగా ప్రస్తుతం ఆ దేశ జనాభాలో 60 ఏళ్ల పైబడ్డ వృద్ధుల జనాభా భారీగా పెరిగిపోయింది. దీనివల్ల భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని అంచనా వేసిన చైనా.. దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి అనుమతిస్తూ.. కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. అయితే ప్రజలు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదట. 2020 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని పది ప్రాంతాల్లో జననాల వృద్ధి రేట్లు పెద్ద ఎత్తున పడిపోయినట్లు వెల్లడయ్యింది. దీని వల్ల రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. దీనికి ప్రధాన కారణం.. పాలకులు తీసుకువచ్చిన విధానాలే అంటున్నారు విశ్లేషకులు.
ఇది కూడా చదవండి : ఆకలి కేకలు: స్మార్ట్ ఫోన్ ఇస్తాను.. బియ్యం పెట్టండి
జననాల రేటు తగ్గిపోవడం.. వృద్ధుల జనాభా పెరుగుతుండటంతో.. చైనా 2021, ఆగస్టులో ముగ్గురు పిల్లల విధానాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం చైనా జనాభా 141.2 కోట్లు కాగా.. వీరిలో 60 ఏళ్లు పైబడిన వారు 26.40 కోట్లు అనగా.. సుమారు 18.7 శాతం ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ముగ్గురు పిల్లలను కనే జంటలకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. పలు రకాల సెలవులు మంజూరు చేయడంతో పాటు.. లోన్లు ఇవ్వడానికి కూడా అంగీకరించింది. కానీ చైనా ప్రజలు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదట.జననాల వృద్ధి రేటు పడిపోవడానికి కరోనా ఒక కారణం అని చైనాలోని ఓ విశ్వవిద్యాలయం నివేదిక వెల్లడించింది. కరోనా తర్వాత మారిన పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఇద్దరు పిల్లల్ని కూడా భారంగానే భావిస్తున్నారట. అంతేకాక.. 1990 తర్వాత పుట్టిన చాలా మంది పెళ్లంటేనే విముఖత చూపుతున్నట్లు.. ఇక్కడి జనాలు పేర్కొంటున్నారు. దేశంలో ఎక్కువ మంది కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని.. ఇలాంటి పరిస్థితులు మధ్య ఇక పెళ్లి, పిల్లల గురించి ఆలోచించడం వృథా అని చైనా యువత అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. పెళ్లి, పిల్లల విషయంలో చైనా ప్రజలు విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : పిల్లలను కనే కొత్త జంటలకు బ్యాంకు రుణాలు