సమాజంలో దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో అప్పు అనేది సర్వసాధారణ విషయం. ధనవంతుడి నుంచి పేదవారి వరకు చాలా మంది అప్పులు చేసే ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అప్పులు తీర్చలేక అవమానాలు పడుతుంటారు. అందుకే అప్పు చేయపోవడమే ఓ రకమైన ఐశ్వర్యమని పెద్దలు అంటుంటారు. సమాజంలో అప్పులేని వాడే నిజమైన ధనవంతుడని నీతి పద్యాలు కూడా తెలిపాయి. కొందరు అప్పులు తీసుకుని ఎగవేసి పారిపోతుంటారు. మరికొందరు మాత్రం అప్పులు తిరిగి చెల్లించలేకుంటే అవమానంగా ఫీలవుతుంటారు. తల తాకట్టు పెట్టైన సరే అప్పును చెల్లిస్తామంటారు. ఇందుకు ధనవంతులు అతీతం ఏమికాదు. తాజాగా ఓ బిలినీయర్.. తన రూ.52 కోట్ల అప్పును తీర్చేందుకు మాంసం సైతం విక్రయించాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. మరి.. అప్పు కోసం ఎందుకు బిలీనియర్ మాంసం అమ్ముతున్నాడు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చైనాకు చెందిన తాంగ్ జియన్(52)కి గొప్ప వ్యాపారవేత్తగా స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. పెద్ద పెద్ద హోటళ్ల వ్యాపారంతో తన ఉనికి చాటుకున్నాకడు. అతి తక్కువ వయస్సులోనే కోట్ల రూపాయల వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. కేవలం 36 ఏళ్ల వయసుకే కోట్లాది రూపాయాలను ఆర్జించాడు. అలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ క్రమంలోనే 2005లో ల్యాండ్ స్కేప్ అనే ఇంజనీరింగ్ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. అప్పటి వరకు ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్న తాంగ్ జియన్ కి బ్రేక్ లు పడ్డాయి. అక్కడి నుంచి ఒక్కొక్కటిగా కష్టలు రావడం ప్రారంభమయ్యాయి. ల్యాండ్ స్కేప్ లో పెట్టిన పెట్టుబడి భారీ నష్టాలను మిగిల్చింది.
ఈ క్రమంలో భారీగా అప్పులు చేసి మరీ.. మరికొన్ని పెట్టుబడులు పెట్టాడు. అయినా నష్టాలే చవిచూశాడు. దీంతో అప్పులు ఇచ్చిన వాళ్లు..తిరిగి చెల్లించాలని తాంగ్ పై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన తన రెస్టారంట్లు, ఇళ్లు, కార్లు, ఇతర ఆస్తులు అమ్ముకున్నాడు. వాటి ద్వారా వచ్చిన డబ్బుల తో అప్పులు కట్టేశాడు. అయినా సరే ఇంకా రూ.52 కోట్లు అప్పు మిగిలిపోయింది. దీంతో ఆ మిగిలిన అప్పు కూడా తీర్చాలని మాంసంతో తయారు చేసే ఆహార పదార్ధాలను విక్రయించడం ప్రారంభించాడు. కోట్ల ఆస్తులను పొగొట్టుకున్న హాంగ్ ఝౌలోనే ఓ వీధిలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనదైన వంటలతో స్థానికులను ఆకట్టుకున్నాడు. తాను అమ్మే మాంసాహారంలో ఎలాంటి పిండి ఉండదని, ఇది అచ్చం మాంసమే ఉంటుందని ఆయన తెలిపాడు.
పార్కుల్లో , మార్కెట్లలో విక్రయించే దానితో పోలీస్తే .. తాను తయారు చేసే ఈ ఫుడ్ ఎంతో సురక్షితమైని తెలిపాడు. ఇక ఆయన మాట్లాడుతూ..” ప్రతి ఒక్కరూ సవాళ్లతో కూడిన జీవితాన్ని గడుపుతుంటారు. ఎన్నో కష్టనష్టాలను చవిచూస్తుంటారు అయితే ఓటమిని అంగీకరించకూదనే స్ఫూర్తి కలిగి ఉండాలి. ఎంత కష్టాలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో నిలబడాలి. పడిలేచే కెరటంలా కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి” అంటూ ఆశావాదంతో మాట్లాడారు. తమకే కష్టాలు ఉన్నాయంటూ కుంగిపోయి.. ఆత్మహత్యలకు పాల్పడే వారికి తాంగ్ జీవితమే ఓ ఆదర్శం. ప్రస్తుతం చైనాలో ఈయన స్టోరీ వైరల్ గా మారింది.