ప్రేమ పెళ్లిళ్లు, డేటింగ్, మీటింగ్, చాటింగ్ చేసిన తర్వాతే పెళ్లిళ్ల వరకు వెళ్తున్నారు. ఎందుకు అంటే ఇలా డేటింగ్ చేస్తే ఒకరి గురించి ఒకరు తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతుంటారు. అందుకే కొన్ని నెలలు, సంవత్సరాలు డేటింగ్ చేసుకుని తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఇలా డేటింగ్ చేసిన తర్వాత కూడా పప్పులో కాలేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే జంట అలా డేటింగ్ చేసి కూడా చేయకూడని తప్పు చేశారు. వాళ్లు చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకునే పరిస్థితి కూడాలేదు.
ఈ జంట పరిస్థితి మరీ చిత్రవిచిత్రమైనది. ఒకటి కాదు రెండు కాదు మూడేళ్లు డేటింగ్ చేశారు. తర్వాత ఒకరిపై ఒకరికి ప్రేమ పెరగడంతో పెళ్లి చేసుకున్నారు. అలా పెద్దల సమక్షంలో 2008లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2011లో మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. తర్వాత 2015లో రెండో బిడ్డను కూడా కన్నారు. అలా పెళ్లై పదేళ్లు గడిచిన తర్వాత వారికి ఒక వింత కోరిక కలిగింది. వారి గతాన్ని, వారి కుటుంబ చరిత్రను తవ్వితీయాలనుకున్నారు. అది వారి జీవితంలోనే చేసిన అతి పెద్ద పొరపాటని తర్వాత తెలుసుకున్నారు.
అలా వారి కుటుంబ చరిత్రను తవ్వితీసిన తర్వాత వారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది. అదేంటంటే.. వాళ్లిద్దరూ అన్నాచెల్లెళ్లు అని. కాసేపు వాళ్లకి ఏమీ అర్థం కాలేదు. అసలు వాళ్లు అన్నాచెల్లెళ్లు కావడం ఏంటి? వాళ్లు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కూడా కన్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక సతమతమైపోయారు. వారి బాధను ఓ వీడియోగా చేసి టిక్ టాక్ లో పోస్ట్ చేశారు. అక్కడ వారి వీడియోకి చిత్రవిచిత్రమైన స్పందనలు వస్తున్నాయి. కొందరైతే అసలు 13 ఏళ్ల తర్వాత బ్యాగ్రౌండ్ చెక్ చేసుకునేది ఏంటని ప్రశ్నిస్తున్నారు.
చాలా మంది వీరి పిచ్చితనాన్ని ఎద్దేవా చేస్తున్నారు. పెళ్లికి ముందు చూసుకోవాల్సిన బ్యాగ్రౌండ్ చెక్ లు ఇప్పుడెందుకు చేసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అయినా పెళ్లి అంటే అంత ఆషామాషీ కాదు ఇలా నచ్చారని అలా పెళ్లిచేసుకోవడానికి. ముందూ వెనుక చూసుకోకుండా ఎలా పెళ్లిచేసుకున్నారని కన్నెర్రజేస్తున్నారు. చాలా మంది ఇంక చేసేది ఏమీ లేదు సైలెంట్ గా భార్యాభర్తల్లా కంటిన్యూ అయిపోండని సలహాలిస్తున్నారు. చాలా మంది వీరి పరిస్థితిపై కుళ్లు జోకులు కూడా వేస్తున్నారు. ఏది ఏమైనా వీరి పెళ్లి బంధం మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ కాబట్టి.. ఆ వీడియో ఇక్కడ పోస్ట్ చేయలేకపోతున్నాం