మనం అందంగా కనిపించాలనుకుంటాం. అందంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండాలనుకుంటాం. అందం కోసం రకరకాల కాస్మోటిక్స్, సబ్బులు వాడతాం. ఆరోగ్యం కోసం వివిధ రకాల ఎక్సెర్‌సైజ్‌లు, యోగా, జిమ్‌కి వెళ్ళి వ్యాయామం చేస్తాం. అయితే చైనాలో ఓ యువతి బరువు తగ్గాలని ఎక్కువగా వ్యాయామాలు చేస్తూ అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
సాధారణంగా మనుషులు అందంతోపాటు ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అయితే అందంగా కనిపించడానికి రకరకాల కాస్మోటిక్స్, సబ్బులు వాడతారు. ఆడవళ్లయితే బ్యూటీ పార్లర్‌కి వెళతారు. ఫేషియల్ లాంటివి చేయించుకుంటారు. అందంతోపాటు ఆరోగ్యం కూడా ఉండాలి కాబట్టి వివిధ రకాల ఎక్సెర్‌సైజ్‌లు, యోగా, జిమ్‌కి వెళ్ళి వ్యాయామం చేస్తారు. అయితే శారీరకంగా వ్యాయామం, యోగా చేస్తూ నియమాల ప్రకారం ఆహారం తీసుకోవాలి. లేదంటే అనుకోని నెగిటివ్ సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాటిని నివారించే క్రమంలో ఆహార నియమాలను తప్పక పాటించాలి.
ఈ మధ్యకాలంలో చాలామంది జిమ్ చేస్తూ కుప్పకూలి చనిపోవడం చూస్తున్నాం. కండలు తిరిగిన బాడీ బిల్డర్స్ కూడా జిమ్‌లో ఎక్సెర్‌సైజ్ చేసి గుండెపోటుకు గురై చనిపోతున్నారు. అలాగే కొందరు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై చనిపోతున్నారు. ఎక్కువగా వ్యాయామం చేయడం ద్వారా కూడా గుండెకు భారమై శారీరకంగా అస్వస్థతకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చైనాలో ఓ యువతి బరువు తగ్గాలని ఎక్కువగా వ్యాయామాలు చేస్తూ అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కుటుంబసభ్యులు దీనికి కారణం అతిగా కసరత్తు చేయడమంటున్నారు. వివరాల్లోకి వెళితే..
చైనాకు చెందిన యువతి పేరు కుయ్‌హువా.. ఆమెకు వయసు 21 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండేది. టిక్‌టాక్‌కు చైనీస్ వర్షిన్‌లో డౌయిన్ యాప్‌లో పలు వీడియోలు పోస్ట్ చేసేది. దీంతో ఫేమస్ అయ్యింది. డౌయిన్ ఆప్ ద్వారా ఆమెకు దాదాపు పదివేల మంది ఫాలోవర్స్ ఉండవచ్చు. రెండు నెలల క్రితం వెయిట్ లాస్ కేంద్రంలో చేరి 27 కిలోల బరువు తగ్గింది. క్రమంగా జిమ్ చేస్తూ 100 కిలోల బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. ఈ లక్ష్యంతో వెయిట్ లాస్ క్యాంప్‌లో చేరింది. క్యాంపులో ఆ యువతి చాలా తీవ్రంగా వ్యాయామం చేసింది. అయితే జిమ్ నిర్వాహకులు మంచి వ్యాయామం, మంచి ఆహారం, నిద్ర, విశ్రాంతి తీసుకోమని సూచించగా.. ఆ నియమాలను యువతి పాటించక కేవలం జిమ్ వర్కౌట్ అతిగా చేయడం వల్ల అస్వస్థతకు గురైంది. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ యువతి మరణించింది. అయితే ఆమె కుటుంబసభ్యులు అతిగా జిమ్ చేయడం వల్లే మరణించిందని సోషల్ మీడియాలో వెల్లడించారు. తన పాత వీడియోల్లో.. తాను 156 కిలోల బరువు ఉన్నానని.. 100 కిలోల బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నానని కుయ్‌హువా తెలిపింది. ఆమె మరణించిన అనంతరం డౌయిన్ ఆమె అకౌంట్‌లోని వీడియోలను డిలీట్ చేసింది. అతిగా వ్యాయామం చేయడం ద్వారా ప్రాణాలమీదకి తెచ్చుకున్న ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి.