బ్రిటన్ రాణి క్వీన్ ఎల్జిబెత్-2(95)ను హత్య చేసేందుకు యత్నించిన భారతీయ యువకుడిని స్కాట్ లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. రాణిని చంపుతానంటూ ఆ యువకుడు మొదటే ఒక వీడియో విడుదల చేశాడు. ఆ తర్వాత రాణి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆమెను హత్య చేసేందుకు చూశాడు. ఇదంతా ఎందుకు చేశావని ప్రశ్నించగా.. తాను ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేశానన్నాడు. 1919లో జలియన్ వాలా బాగ్ మారణకాండకు ప్రతీకారంగా, తెల్లవాళ్లు భారతీయులను పెట్టిన చిత్రవదలకు సమాధానంగా రాణిని చంపేందుకు యత్నించినట్లు యువకుడు తెలిపాడు.
మొదట ఆ సిక్కు యువకుడు ఒక వీడియో విడుదల చేశాడు. ‘నేను చేసిన దానికి, చేయబోయే దానికి నన్ను క్షమించండి. నేను క్వీన్ ఎల్జిబెత్ ను హత్య చేయబోతున్నాను. ఇది 1919 జలియన్‌వాలా బాగ్ లో జరిగిన హత్యాకాండకు ప్రతీకారం. తెల్లవారి చేతుల్లో ఎవరైతే చంపబడ్డారో, బాధింపబడ్డారో, వివక్షకు గురయ్యారో వారి తరఫున ప్రతీకారంగా ఇలా చేయబోతున్నాను. నేను ఒక భారతీయ సిక్కును. నా పేరు జశ్వంత్ సింగ్ ఛాయిల్’ అంటూ మాస్కుతో ఉన్న యువకుడు విడుదల చేసిన వీడియోలో ఉంది.
ఆ యువకుడు సౌతాంప్టన్ లో నివాసముంటున్నాడు. క్రిస్మస్ రోజు రాజప్రాసాదంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై పోలీసులు మెంటల్ హెల్త్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జశ్వంత్ సింగ్ ఛాయిల్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.