మామయ్య అంటే తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు. మెట్టినింట్లో భర్త సరిగ్గా చూసుకోకపోతే ఆ కోడలు ముందుగా కంప్లైంట్ ఇచ్చేది మామకే. అలా కొడుకు భార్యని.. కూతురిలా చూడాల్సిన ఓ మామ తన వక్రబుద్ధి చూపించాడు. తన కోరికలు తీర్చాలంటూ కోడలిని వేధించాడు. తనకి ఎదురైన కష్టాన్ని భర్తతో చెప్పుకుంటే.. మా నాన్నే కదా సహకరించు అంటూ భర్త వేధించాడు. సభ్య సమాజం తల దించుకునే ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుంటూరు అర్బన్ ఎస్పీ నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఓ మహిళ తన తిరుగుబోతు భర్త.., కీచక మామల నుంచి తనకి, తన బిడ్డకి రక్షణ కల్పించాలని పోలీసుల ముందుకి వచ్చింది.
గుంటూరు డొంకరోడ్డుకు చెందిన ఎలినేని సందీప్ 2016 సంవత్సరంలో శ్రీనగర్‌కు చెందిన స్వాతిని రెండో వివాహం చేసుకున్నాడు. కానీ.., భర్త తిరుగుబోతు అని ఆమెకి కొంతకాలానికే అర్ధం అయ్యింది. సందీప్ టిక్‌టాక్ ద్వారా పరిచయం అయిన అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని, ఇంటిని పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయంలో సందీప్ తల్లి పద్మావతి కూడా అతనికే వత్తాసు పలికింది. అయితే.., ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసే పద్మావతి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో.., ఆ ఉద్యోగం తన భర్తకి ఇప్పిస్తే కుటుంబ పోషణ సులువు అవుతుందని, పనిలో పడితే భర్త తిరుగుళ్ళు కూడా మానేస్తాడని స్వాతి భావించింది. ఈ విషయాన్ని తన మామ సందీప్ తండ్రి, తన మామ శ్రీనివాసరావుకి తెలియచేసింది.
కొడుకుని దారిలో పెట్టి, కోడలి కాపురాన్ని కాపాడాల్సిన శ్రీనివాసరావు కోడలిపై కన్నేశాడు. నాతో ఉండు నీకు న్యాయం చేస్తానంటూ దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఓసారి బాత్‌రూమ్‌లో రహస్యంగా సీసీ కెమెరాలు కూడా పెట్టాడు. దీంతో.., స్వాతి ఈ దారుణాలను భరించలేక జరిగింది అంతా భర్తకి చెప్పుకుంది. కానీ.., సందీప్ నుండి ఇంకా దారుణమైన సమాధానం వచ్చింది. అమ్మ ఉద్యోగం నాకు రావాలంటే నాన్న ఎన్‌ఓసిపై సంతకం చేయాలి. కాబట్టి.. నువ్వు నాన్నకి సహకరించు అంటూ భర్త దారుణంగా మాట్లాడాడు. కానీ.., స్వాతి మాత్రం వారికి లొంగకుండా ఆ ఇంటి నుండి బయటకి వచ్చేయాలని చూసింది.
స్వాతిని బంధించి సరిగ్గా తిండి కూడా పెట్టకుండా.., మామ శ్రీనివాసరావు కోడలిపై లైంగిక దాడికి కూడా ప్రయత్నించాడు. చివరికి బంధువుల సహాయంతో స్వాతి శ్రీనగర్‌లోని పుట్టింటికి చేరింది. ఇదంతా జరిగి 2 సంవత్సరాలు అవుతోంది. కానీ.., ఇప్పటికీ భర్త, మామ నుండి ఆమెకి బెదిరింపులు, వేధింపులు ఆగడం లేదు. ఈ కారణంగానే స్వాతి చివరికి కుమార్తెని తీసుకుని పోలీసుల ముందుకి వచ్చి, తమకి రక్షణ కల్పించాలని కోరింది. గుంటూరు అర్బన్ పోలీసులు ఇప్పుడు విచారణ ప్రారంభించారు. మరి.. చూశారు కదా? ఇలాంటి కీచక మృగాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.