ఢిల్లీ వేదికగా జరిగిన 49వ జీఎస్టీ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా, స్టేషనరీ వస్తువులపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ నేతృత్వంలో జరిగిన 49వ జీఎస్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా స్టేషనరీ వస్తువులపై జీఎస్టీని 18నుంచి 12శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ వంటి స్టేషనరీ వస్తువుల ధరలు భారీగా దిగిరానున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది విద్యార్థుల చదువులకు ఊరట నిచ్చే విషయమే.
ప్రస్తుతం పిల్లల చదువులు భారంగా మారిన సంగతి తెలిసిందే. ఎల్ కేజి చదువులకు కూడా వేలకు వేలు చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇంటర్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి పైచదువుల ఫీజులు లక్షల్లోనే. వీటికి తోడు పిల్లలు చుదువుకునే పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులు వంటి వాటిపై జీఎస్టీ. వీటి నుంచి ఉపశమనం కలిగించే వార్త చెప్పింది.. జీఎస్టీ కౌన్సిల్. ప్రస్తుతం స్టేషనరీ వస్తువులపై ఉన్న జీఎస్టీని 18నుంచి 12శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది భారీ తగ్గింపు కానప్పటికీ.. విద్యార్థులు చదువులకు ఎంతో కొంత ఊరటనిచ్చేదే.
Delhi | 49TH meeting of the GST Council begins at Vigyan Bhawan. pic.twitter.com/UI7cXeEGP0
— ANI (@ANI) February 18, 2023
ఇదిలావుండగా రాష్ట్రాలకు బకాయి ఉన్న జీఎస్టీ పరిహారం మొత్తాన్ని తక్షణమే విడుదల చేస్తున్నట్లు నిర్మలా సీతారమన్ ప్రకటించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆమె ఈ ప్రకటన చేశారు. జూన్ కు సంబంధించి రూ.16,982 కోట్లు పెండింగ్లో ఉన్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రస్తుతం కాంపన్సేషన్ ఫండ్ లో అంత మొత్తం లేకపోయినా కేంద్రం సొంత నిధుల నుంచి ఆ మొత్తం చెల్లించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వసూలు చేసే సెస్ నుంచి ఆ నిధులను సర్దుబాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజా నిర్ణయంతో రాష్ట్రాలకు గత ఐదేళ్లలో బాకీ ఉన్న మొత్తం క్లియర్ అవుతుందని చెప్పారు.
#GSTCouncil defers decision on Appellate Tribunal.
For the latest news & updates, visit: https://t.co/gXeGqKQ77P pic.twitter.com/DCdq4DB4w4
— BQ Prime (@bqprime) February 18, 2023