స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 140 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 150 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,100.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,200.
1కిలో వెండి 65,100
బిజినెస్ డెస్క్- ఈ రోజు శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 14 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 15 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 140 రూపాయలు పెరిగి 45 వేల 100 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 150 రూపాయలు పెరిగి 49 వేల 200 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 300 పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 65 వేల 100 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 500 రూపాయలు పెరగగా, 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 550 రూపాయలు పెరిగింది.

ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 380 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,500 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46 వేల 860 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47 వేల 860 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,120 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 51,410 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.
