రాజకీయాల పూర్తిగా స్వస్థి చెప్పి.. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తున్న నేత ఎన్ రఘువీరా రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖ మంత్రులుగా వ్యవహరించారు. రాజకీయాల నుండి బయటకు వచ్చేసిన ఆయన..తన స్వగ్రామంలో
రాజకీయాల పూర్తిగా స్వస్థి చెప్పి.. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తున్న నేత ఎన్ రఘువీరా రెడ్డి. రాజకీయాల్లో మంత్రులు, కేంద్ర మంత్రులుగా లేదా ఎమ్మెల్యేలుగా పదవీలో ఉన్నా సమయంలోనే కాకుండా లేకున్నా సమయంలో కూడా కార్యకర్తలు, ఇతర పార్టీ శ్రేణులు వారి చుట్టూ తిరుగుతూ హంగామా సృష్టిస్తుంటారు. కానీ రఘువీరా రెడ్డి దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖ మంత్రులుగా వ్యవహరించారు. రాజకీయాల నుండి బయటకు వచ్చేసిన ఆయన.. తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ బతికేస్తున్నారు. గ్రామంలో ఆలయాలు నిర్మిస్తూ.. రైతులకు సూచనలు ఇస్తూ.. సగటు మనిషిగా మారిపోయారు. ఇప్పుడు మరోమారు ఆయన వార్తల్లో నిలిచారు.
సింప్లిసిటీకి నిలువెత్తు అద్దంలా మారిపోయిన ఆయన.. తన కోడలికి అంతే సింపుల్‌గా శ్రీమంతం జరిపించారు. తమ స్వగ్రామమైన అనంతపురం నీలకంఠాపురం ప్రాథమిక వైద్య కేంద్రంలో ఈ నెల 28న కోడలు దీక్షకు సీమంతం జరిపారు. అక్కడి వైద్య సిబ్బంది దీక్షకు గంధం పూసి, ఆశ్వీరదించారు. ఈ సందర్భంగా తమ గ్రామంతో పాటు పరిసరాల్లోని గర్భిణీలను ఆహ్వానించి కుంకుమ, గాజులు, జాకెట్లు, పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. వారికి కూడా శ్రీమంతం జరిపించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరి భోజనాలు వడ్డించి, విస్తరాకులు కూడా తానే స్వయంగా తీశారు. అయితే తన కోడలు కోరిక మేరకు ఇలా చేసినట్లు రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. ఆమె ఆలోచనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ సందర్భంతా ఆయన కోడలు దీక్ష మాట్లాడారు. గర్భిణీలు బలమైన పౌష్టికాహారం తీసుకోవాలని, తద్వారా పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రక్తహీనత గర్భిణీలకు ఒక సవాల్‌గా మారిందని, దీనిని అధిగమించాలని సూచించారు. కన్నడ, ఇంగ్లీషుల్లో మాట్లాడారు. కులమత భేదాలు లేకుండా ఇంతమందితో కలిసి తాను ఇక్కడ సీమంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గర్భిణీలకు పసందైన వంటకాలతో విందు భోజనాలు వడ్డించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని దగ్గర ఉండి చూసుకున్నారు రఘువీరా రెడ్డి. భోజనాలు అయిన తరువాత విస్తరాకులను ఆయనే స్వయంగా ఎత్తి అక్కడి వారందరినీ ఆశ్చర్యపోతున్నారు. ఇది ఆయన సింప్లిసిటీ మరో నిదర్శనం అని కొనియాడుతున్నారు.
తన శ్రీమంతం సందర్బంగా తనతోపాటు మా మండలంలోని మా గ్రామం చుట్టుప్రక్కల గ్రామాలలోని గర్భినులతో కలసి శ్రీమంతం జరుపుకొని వారికి బహుమతులను ఇవ్వాలనే మా కోడలు దీక్ష ఆలోచనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. pic.twitter.com/Efh4mfShh2
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) June 28, 2023