గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు..ఇక ఆ తర్వాత వచ్చే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను కూడా భక్తశ్రద్ధలతో నిర్వహించాలని ఆశ పడటమే వారి పాలిట మృత్యుశాపంలా మారింది..అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు సంతోషంగా బయల్దేరిన వారు..శవాలై తిరిగి వచ్చారు.. పండుగ పూట సంతోషంగా ఉండాల్సి ఆ ఇళ్లల్లో విషాదాఛాయలు ఆలుముకున్నాయి.. దుర్గాదేవి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన విషాదకర ఘటన మహారాష్ట్రల్లో చోటు చేసుకుంది..
వర్ధా జిల్లాకు చెందిన కొందరు భక్తులు, దుర్గా మాత మండలి సభ్యులు తమ ఊళ్లో నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం బుల్రాణా జిల్లాలోని ప్రసిద్ధ ప్రాంతమైన షేగావ్‌కు బయలుదేరారు. తమ ఊరికి శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ఒక పికప్ వాహనంలో ఎక్కించుకున్నారు. అమ్మ వస్తోందన్న ఆనందంతో ఆ యువకుల ముఖాల్లో నవ్వులు వెలిసాయి. కానీ, ఆ నవ్వులు కొన్ని గంటల్లోనే కన్నీటి సంద్రంగా మారుతాయని వారు కలలో కూడా ఊహించి ఉండరు.
సమయం సరిగ్గా తెల్లవారుజామున 1 గంట సమయం.. అమరావతి జిల్లా ధామన్‌గావ్ రైల్వే సమీపంలోని ఛానల్ 97 వద్ద ఉన్న ప్రముఖ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే. దుర్గమాత విగ్రహంతో ప్రయాణిస్తున్న బొలెరో పికప్ వాహనం హైవేపై చాలా నెమ్మదిగా, భక్తి భావంతో ముందుకు సాగుతోంది. సరిగ్గా అదే సమయంలో.. వెనుక నుంచి మృత్యువు దూసుకొచ్చింది.. అతి వేగంగా వచ్చిన ట్రక్కు..వారు ప్రయాణిస్తున్న బొలేరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.. ఈ ప్రమాద తీవ్రత ఎంతాల ఉందంటే..ఆ వ్యాన్ ముందు భాగం, వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. వాహనంలో ఉన్న భక్తులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. దేవీ విగ్రహం పక్కనే ఉన్న భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద శబ్దం విన్న స్థానికులు, హైవే పెట్రోలింగ్ పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రులను బయటకు తీసి.. వెంటనే ధామన్‌గావ్ గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో, మెరుగైన చికిత్స కోసం వారిని వార్ధాలోని సావంగి ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రమదానికి నిద్ర మత్త లేదా అతివేగమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు… ఏదేమైన ఓ ప్రమాదం ఏడుగురిని బలితీసుకుంది..వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
#BREAKING Five killed and twenty injured after a speeding truck collided with a Bolero pickup van near Dhamangaon in Maharashtra’s Amravati district.@CMOMaharashtra @DGPMaharashtra @AmravatiPolice #SamruddhiHighway #AmravatiAccident #RoadSafety #MaharashtraNews pic.twitter.com/OeCvW3yAzu
— jarvis ☠️ (@Vishii14) October 2, 2026
