ధనాధన్ క్రికెట్ హంగామా ఐపీఎల్ 15సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభ కానుంది. దీంతో జట్లన్నీ మెగా లీగ్ కోసం సిద్దమవుతున్నాయి. కొత్త సీజన్లో సరికొత్తగా ఉండేందుకు అప్‌గ్రేడ్ అవుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా యంగ్ గన్ రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌కు తమ నూతన జెర్సీని విడుదల చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నూతన జెర్సీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా నూతన జెర్సీని ఒక వీడియో రూపంలో విడుదల చేసింది.
43 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోలో మొత్తం జెర్సీని రివీల్ చేయగా అది అభిమానులను ఆకట్టుకుంటుంది. జెర్సీపై టైగర్ ప్రింట్‌ను హైలేట్ చేశారు. ప్రాథమికంగా నీలం రంగు ఉండగా.. పై భాగంలో ఉన్న ఎరుపు కూడా ఆకట్టుకుంటుంది. జెర్సీ కింది భాగమంతా నీలం రంగుతో నిండి ఉంది. కాలర్, ఎడమ చేయ్యి భుజంపై ఎరుపు రంగు ఉంది. అలాగే జెర్సీపై సాధారణంగా ఉండే ఫ్రాంచైజీ పేరు, ప్రకటనలకు సంబంధించినవి ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి జెర్సీలో ఎరుపు రంగు మోతాదు పెంచారు. మొత్తానికి ఈ నూతన జెర్సీ ఆకట్టుకుంటుంది. మరి ఢిల్లీ న్యూజెర్సీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022: ముంబైని గట్టి దెబ్బకొట్టిన రాజస్థాన్ రాయల్స్!
🎥 | #NayiDilliKiNayiJersey ➡️ In all its glory 💙❤️#YehHaiNayiDilli #IPL2022 pic.twitter.com/D8vwyr4fdt
— Delhi Capitals (@DelhiCapitals) March 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.
