నిన్న మొన్నటి వరకు కాస్త శాంతించిన మాయదారి కరోనా వైరస్.. ఇప్పుడు దేశంలో మళ్ళీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు అమితంగా పెరుగుతున్నాయి. మరి.. ఇలాంటి కరోనా కాలంలో తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
1) కరోనా.. కట్టడికి ఉన్న ఇప్పుడున్న మార్గాలలో అతి ముఖ్యమైనది భౌతిక దూరం పాటించడమే. రానున్న మూడు నెలలు చాలా కీలకం కాబట్టి.. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకి రాకూడదు.
2) ఏ ముహూర్తాన కరోనా మొదలైందో తెలియదుగాని.. అప్పటి నుండి మాస్క్, శానిటైజర్ మన జీవితంలో నిత్యవసర వస్తువులుగా మారిపోయాయి. కావున వీటిని మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి.
3) ప్రతిరోజు ఉదయం కొంత సమయం సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. కొద్ది సమయం ఎండలో ఉండడం మరీ మంచిది.
4) రోజుకు రెండు పూటల ఆవిరి పట్టాలి.
5) ఉప్పు, పసుపు కలిపిన గోరు వెచ్చని నీటితో రోజు రెండు సార్లు గార్గిలింగ్ చేయాలి.
6) వేడి ఆహార పదార్థాలు, పోషక విలువలుండే ఆహారానే తీసుకోవాలి. గోరు వెచ్చని నీరు తాగాలి.
7) శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వాలి.
8) ప్రతి రోజు ప్రాణాయామం చేయాలి. ఇతర వ్యాయమాలు చేయాలి. ఇవి కేవలం కరోనా కాలంలో మాత్రమే కాదు, మిగతా అన్నీ సమయాల్లో కూడా చేస్తే మంచిది.
9) ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ తీసుకొని వారు ఉంటే.. త్వరగా వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది.
10) దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉండేలా చూసుకోవాలి.