మహిళలకు గొడవలు పడేందుకు కారణాలు అవసరం లేదు. అత్తా- కోడళ్లు, వదిన-ఆడపడుచులు తన్నుకున్న ఘటనలు చూశాం. ఇక ఇల్లు కాదని వీధులో కూడా గొడవ పడిన ఘటనలు అనేకం ఉన్నాయి
మహిళలకు గొడవలు పడేందుకు కారణాలు అవసరం లేదు. అత్తా- కోడళ్లు, వదిన-ఆడపడుచులు తన్నుకున్న ఘటనలు చూశాం. ఇక ఇల్లు కాదని వీధులో కూడా గొడవ పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నీట కుళ్లాయి దగ్గర నుండి బస్సులో సీటు వరకు తన్నుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. చిన్న చిన్న వివాదాలే.. రోడ్డుపై జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్న వీడియోలను చూశాం. గొడవ మొదలైందా.. నువ్వా-నేనా అని తేలేంత వరకు చిన్నపాటి యుద్ధం చేస్తూనే ఉంటారు. వీరి మధ్యకు ఎవ్వరూ వెళ్లినా వారి పని మటాషే. ఆధిపత్యం కోసం ఒంటిపై దుస్తులు ఊడిపోతున్నా పట్టించుకోకుండా కుస్తీలకు దిగుతారు. ఇటీవల కర్ణాటక బస్సు సీటు కోసం పొట్టుపొట్టుగా తన్నుకున్న వీడియో వైరల్ అయిన సంగతి విదితమే.
తాజాగా ఇప్పుడు ఓ బస్టాండ్ లో ఏకంగా మహిళా ఉద్యోగినిపై రెచ్చిపోయిందో మహిళ. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని లాతూర్‌లో చోటుచేసుకుంది. మహిళ కండక్టర్ పై శివంగిలా దూసుకెళ్లి చేయి చేసుకుంది. కండక్టర్ ప్రతిఘటించేందుకు ప్రయత్నించింది. అయినా ఆగకుండా మరోసారి ఆమెను చాచి కొట్టింది. అయితే అక్కడ ఉన్న ప్రయాణీకులు ఆ మహిళను వారించేందుకు వచ్చారు. ఇతర ప్రయాణీకులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో ఆ గొడవ అక్కడికి ఆగిపోయింది. అయితే ఈ ఘటనను చూసిన అనేక మంది వీడియో తీసి పోస్టు చేయడంతో నెట్టింట్ల వైరల్ అవుతుంది. అయితే వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగి.. అది కొట్టుకునేంత వరకు వచ్చిందని తెలుస్తోంది. అయితే ఏ అంశంపై వీరి మధ్య వివాదం మొదలైందో తెలియరాలేదు.
Viral Video | लातूर बस स्थानकात महिला कंडक्टर आणि महिला प्रवाशात हाणामारी; सोशल माध्यमावर व्हिडिओ व्हायरल#viralvideo #latur #womenfight #marathinews #zee24taas
— Ramraje Shinde (@ramraje_shinde) July 30, 2023