కారణం లేకుండా పిల్లలు ఒంటరిగా కూర్చొనిఅదే పనిగా నవ్వుతుంటే అనుమానించాలని వైద్యులు సూచిస్తున్నారు. మూర్ఛ వ్యాధిలో ఇదో రకం అని వైద్యులు తెలిపారు. వైద్య భాషలో దీనిని గెలాస్టిక్ సీజర్స్ గా వ్యవహరిస్తారు. రెండు లక్షల మంది చిన్నారుల్లో ఒకరు ఈ అసాధారణ సమస్యతో బాధపడుతుంటారని ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఒకరు తెలిపారు. తాజాగా మూడేళ్ల బాలికకు విజయవంతంగా ఈ సర్జరీ చేసినట్లు తెలిసినట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ‘మెదడులో ఐపోథాలమస్ అనే భాగం ఉంటుంది. ఇది చాలా కీలకమైనది. ఆ ప్రాంతంలో కణితి ఏర్పడినప్పుడు పిల్లలు గెలాస్టిక్ సీజర్స్ బారినపడతారు. ఎప్పుడు పడితే అప్పుడు, కారణం లేకుండా నవ్వుతూ ఉంటారు. ఇటీవల ఓ మూడేళ్ల బాలిక ఈ సమస్యతో బాధపడింది. ఆరు నెలల క్రితం ఆ పాప తల్లిదండ్రులు ఈ సమస్యను గుర్తించారు. అనంతరం వైద్యలను సంప్రదించడంతో ఆ పాపకి చికిత్స అందించారు. పిల్లల్లో అకారణంగా నవ్వులు మూర్ఛలో ఓ రకమైనది అని వైద్యలు తెలిపారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.