తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పంపిన నోటీసులతో ర్యాపిడో సంస్థ దిగొచ్చింది. ఆర్టీసీ బస్సులను అవమానించే విధంగా చిత్రీకరించిన యాడ్‌ను ర్యాపిడో తొలగించింది. అల్లు అర్జున్ నటించిన ఈ యాడ్ వివాదస్పదమైంది. ఆర్టీసీని కించపరిచేలా దోశతో పోలుస్తూ ఈ యాడ్ ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఈ వాణిజ్య ప్రకటన ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అల్లు అర్జున్ తో పాటు ర్యాపిడో సంస్థకు నోటీసులు పంపించారు. నోటిసులకు స్పందించిన ఆ సంస్థ ప్రకటనను శనివారం తొలగించింది.