వికారాబాద్- వివాహేతర సంబంధం.. ఈ రోజుల్లో సర్వ సాధారణంగా వినిపిస్తున్న పదం. అవును సమాజంలో కొంత మంది వివాహేతర సంబంధాలతో పెడ ద్రోవ పడుతున్నారు. లక్షణంగా పెళ్లి చేసుకున్న భార్య, లేదా భర్త ఉండగా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని.. చివరికి పరువును బజారుకీడ్చుకుంటున్నారు. కొన్ని సందర్బాల్లో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.
ఇదిగో తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. వారిద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. ఆమెకు పెళ్లి కావడంతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ అతడికి ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరు ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరి మీద ఒకరికి ఏర్పడిన ప్రేమ కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇంకేముంది కలిసి జీవించాలనుకున్నారు. కానీ వారి నిర్ణయాన్ని వారి వారి కుటుంబాలతో పాటు, సమాజం అంగీకరించదని భావించి ఆత్మహత్య చోసుకోబోయారు.
ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. హైదరాబాద్ కు చెందిన 32 ఏళ్ల ఓ వివాహిత వికారాబాద్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు ఓ ప్రైవేటు కంపెనీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. సదరు మహిళకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వివాహితకు, యువకుడికి స్నేహం పెరిగి అక్రమ సంబంధం ఏర్పడింది. గత కొంతకాలంగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అంతటితో ఆగకుండా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.
ఐతే తమ పెళ్లికి కుటుంబ సభ్యులు, సమాజం ఒప్పుకోదని, అడ్డంకులు వస్తాయని భావించినన మహిళ, యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కండ్లపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లి పురుగుల మందు తాగారు. అదే సమయంలో అటుగా వచ్చిన స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం వారిని వికారాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.