ప్రభాస్.. ప్రస్తుతం ఈ పేరు గురించి ఇండియన్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. సాహో, రాధే శ్యామ్ సినిమాలతో బాలీవుడ్‌లో పాగా వేశాడు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. సినిమాల ద్వారా కన్నా కూడా వ్యక్తిగతంగా ప్రభాస్‌కు అభిమానులు ఎక్కువ. ఫ్యాన్స్‌కు ఆయన డార్లింగ్. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో ప్రభాస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు అభిమానులు.
ఇండస్ట్రీలో ప్రభాస్ సినిమాల గురించే కాక.. ఆయన పెళ్లి మీద కూడా అనేక వార్తలు ప్రచారం అవుతుంటాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని అభిమానులు ఎదురు చూశారు. కానీ ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. కాకపోతే మీడియాలో మాత్రం ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు వైరలవుతూనే ఉంటాయి. ఆయన పెళ్లి గురించి ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారం కాగా.. తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ప్రభాస్ వయసు 42 సంవత్సరాలు. త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాక ఈ ఏడాది ప్రభాస్ తప్పకుండా పెళ్లి పీటలు ఎక్కుతారని భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రభాస్ పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆయన మాటలు విన్న అభిమానులు కొందరు ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అంటున్నారు. మరి ఇంతకు వేణుస్వామి ఏమన్నాడు అంటే..
వేణుస్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం తర్వాత ఆయన పేరు మార్మొగిపోయింది. ఇక ఆ తర్వాత నుంచి ఆయన పలువురు సెలబ్రిటీల భవిష్యత్తు గురించి చెప్తూ వీడియోలు పోస్ట్ చేయడం.. అవి వైరలవ్వడం కామన్‌గా మారింది. వేణు స్వామి చెప్పడం వల్లే రష్మిక నిశ్చితార్థం రద్దు చేసుకుందనే టాక్ కూడా ఉంది. ఈ క్రమంలో వేణు స్వామి ప్రభాస్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయనకు పెళ్లి అచ్చిరాదని.. కాదని చేసుకుంటే.. హీరో ఉదయ్ కిరణ్ జీవితం ఎలా అయ్యిందో.. ప్రభాస్ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటాడని చెప్పుకొచ్చాడు వేణు స్వామి.
ఉదయ్ కిరణ్ రెండు సినిమాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారాడు. స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు. ఆ తర్వాత వరుస ప్లాఫ్‌లతో డీలా పడ్డాడు. అయితే కెరీర్‌లో మంచి హోదాలో ఉన్న సమయంలో పెళ్లి చేసుకోగా.. ఆ తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని వేణు స్వామి చెప్పడం గమనార్హం. ఆయన మాటలు విన్న అభిమానులు కొందరు ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడం బెటర్ అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.