న్యూ ఢిల్లీ- కరోనా ప్రపంచాన్ని మొత్తం కాకావికలం చేసింది. ఈ మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసేసింది. ప్రధానంగా సామాన్యులను, మద్య తరగతి వాళ్లను ఆర్ధికంగా దెబ్బతీసింది. అంతే కాదు కరోనా వల్ల విధ్యార్ధులు సైతం నష్టపోయారు. లాక్ డౌన్ నేపధ్యంలో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. దీంతో విధ్యార్ధులకు ఆన్ లైన్ లోనే క్లాసులు జరిగాయి. ఇక ఇంటర్ వరకు పరీక్షలు లేకుండానే అందరిని పాస్ చేశారు చాలా రాష్ట్రాల్లో. ఇక ఇప్పుడు మళ్లీ కరోనా తగ్గుముఖం పట్టడంతో విధ్యా సంస్థలను ప్రారంభించేందుకు ప్రభుత్వాలు సన్నద్దం అవుతున్నాయి.
తెలంగాణలో జులై 1 నుంచి విధ్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటివంటి సమయంలో ఇప్పుడే స్కూళ్లను ప్రారంభించడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా పూర్తిగా అదుపులోకి రాకపోవడం, పిల్లలకు వ్యాక్సిన్ రాకపోవడం వంటి కారణాలతో ఇప్పటికిప్పుడు పాఠశాలలు తెరవడం అంత శ్రేయస్కారం కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలపై భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు సంబంధించిన మొదటి దశ, రెండవదశ ట్రయల్స్ డేటా సెప్టెంబర్ నాటికి వస్తుందని ఆశిస్తున్నామని ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
ఆ తరువాత దేశంలోని చిన్నారులకు టీకాలు అందుబాటులో ఉండవచ్చని ఆయన అన్నారు. దీనికన్నా ముందుగా ఫైజర్ వ్యాక్సిన్ ఆమోదం పొందితే అది కూడా పిల్లలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అలాగే జైడస్ వ్యాక్సిన్ ఆమోదంపొందితే అది కూడా మరొక ఎంపిక అవుతుందన్నారు. పాఠశాలలు తిరిగి తెరవాలంటే చిన్నారులకు టీకాలు వేయడం తప్పనిసరి డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. అందుకని సెప్టెంబర్, లేదా అక్టోబర్ లో పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వలస్తే.. ఆ తరువాత డిసెంబర్ లేదా జనవరిలో స్కూళ్లను తెరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.