బాలీవుడ్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి. నవాజుద్దీన్ సిద్ధిఖీ తన అంకితభావం, తన పని పట్ల మక్కువతో పరిశ్రమలో తన ఉనికిని చాటుకున్న వారిలో ఒకరు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో నటించాడు. తాజాగా అతడు ముంబైలో తన డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకున్నాడు. దీనికి అతడే ఇంటీరియర్ డిజైనర్‌గా మారడం విశేషం. గ్రామంలో తన బాల్యాన్ని గడిపిన ఇంటిని గుర్తుకు తెచ్చేలా ఈ కొత్త బంగ్లాను నిర్మించాడట నవాజుద్దీన్. ఈ ఇంటికి నవాజుద్దీన్ సిద్ధిఖీ తండ్రి నవాబుద్దీన్ సిద్ధిఖీ పేరు పెట్టారని, దానిని నవాబ్ అని పిలుస్తారని పేర్కొంది..నవాజుద్దీన్ సిద్ధిఖీ తండ్రి 2015లో 72 ఏళ్ల వయసులో మరణించారు.
ఈ ఇల్లు పూర్తి కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఓ పోస్ట్ పెట్టాడు..‘ఒక మంచి నటుడు ఎప్పుడూ చెడ్డ వ్యక్తి కాలేడు, ఎందుకంటే అతని అంతర్గత స్వచ్ఛత మంచి చర్యను బయటకు తెస్తుంది ’అని పోస్ట్ చేశాడు. ఆ మద్య నవాజుద్దీన్ సిద్ధిఖి బాలీవుడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. చిత్ర పరిశ్రమలో నెపోటిజం కంటే కూడా ఎక్కువగా రేసిజం(జాత్యంహకారం) సమస్య ఉందని పేర్కొన్నాడు. పరిశ్రమలో పక్షపాతాలు పోవాలని, ఇప్పటికే దానివల్ల ఎంతోమంది గొప్ప నటులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు.
పాత్ర ఏదైనా పరకాయప్రవేశం చేయడం అతడి నైజం. పలు అవార్డులను కూడా నవాజుద్దీన్ సొంతం చేసుకున్నాడు. సినిమాల విషయానికొస్తే, ఈ నటుడు హీరోపంతి 2 , బోలే చుడియాన్‌లో నటించనున్నారు. అతను బద్లాపూర్, కిక్, రామన్ రాఘవ్ 2.0, బజరంగీ భాయిజాన్, రయీస్, మాంఝీ: ది మౌంటెన్ మ్యాన్, మోతీచూర్ చక్నాచూర్ , రాత్ అకేలీ హా వంటి చిత్రాలలో నటించాడు.