హెల్త్ డెస్క్- కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాను ఎదుర్కోవడానికి వైద్య నిపుణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కరోనా ఉదృతి తగ్గకపోగా.. అంతకంతకు పెరిగిపోతోంది. అందుకని ముందు కరోనాతో పోరాడే శక్తిని సహజసిద్దంగా పొందాలని ప్రాచీన వైద్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంపొందించుకుంటే కరోనా లాంటి వైరస్ కోసినా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని వీరంటున్నారు. ఇందుకోసం చాలా సులభమైన ఆహార నియమాలు, ఆయుర్వేద చిట్కాలను మనకు గుర్తు చేస్తున్నారు వైద్య నిపుణులు. అందులో ప్రధానమైనది చద్దన్నం. అవును మీరు విన్నది నిజమే. చద్దన్నం మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. కరోనా సమయంలో పల్లెటూరి బ్రేక్ ఫాస్ట్ గా పేరొందిన చద్దన్నం మరోసారి తెరపైకి వచ్చింది. ఆచద్దన్నం కరోనాను ఎదుర్కోవడంలో ఎలా సహాయం చేస్తుందో మన సుమన్ టీవీ ద్వార తెలుసుకుందాం. ఇప్పుడంటే బ్రెడ్ జామ్, పిజ్జా, బర్గర్లు వచ్చాయి గాని.. ఒకప్పుడు పల్లెల్లో బ్రేక్ ఫాస్ట్ అంటే చద్దన్నమే. న్యూట్రీషియన్స్ పరంగా చద్ధన్నం ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆహార నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, ఉత్సాహంగా ఉండటానికి ఈ చద్దన్నం తినడం వలన ఎంతో ఉపయోగం ఉంటుందంటున్నారు. అంతే కాదు చద్దన్నం వడదెబ్బనుంచి రక్షించడంతో పాటు, జీర్ణక్రియలో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాల్ని హరిస్తుందట. ఇక మతిమరుపు, ఆల్జీమర్స్, బుద్ధిమాంద్యం వంటి సమస్యల్ని చద్దన్నం మహబాగా నిలువరిస్తుందని న్యూట్రిషియన్స్ చెబుతున్నారు. చద్దన్నాన్ని పులియబెట్టినప్పుడు అందులో చేరిన బ్యాక్టీరియా అన్నంలోని పోషకాలతో చర్య పొందడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాల శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మామూలు అన్నంతో పోలిస్తే పులియబెట్టిన అన్నంలో ఐరన్ 21 శాతం ఎక్కువ ఉటుందట. చద్దన్నాన్ని రెగ్యులర్ గా తినేవాళ్లలో బి12 విటమిన్ సమృద్ధిగా ఉండి ఏ మాత్రం అలసటకు గురికారంటున్నారు. ఇది బలవర్థకమైన ఆహారమనీ, రోగనిరోధక శక్తిని పెంచుతుందనీ రక్తహీనత లేకుండా దంతాలూ, ఎముకలను దృఢంగా ఉంచుతుందని న్యూట్రీషన్స్ తెలిపారు. కరోనాకు చెక్ పెట్టే రోగ నిరోధక శక్తి చద్దన్నంతో బాగా పెంపొందుతుందట. ఒకప్పుడు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో వేసుకొని దానిని ఉదయాన్నే తినేసి పొలం పనులకి వెళ్లిపోయేవారు.
ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో చద్దన్నం, పులిసిన మజ్జిగలో బ్యాక్టీరియా కరోనాతో యుద్ధం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని చద్దన్నం గొప్పతనంపై భారతదేశమంతా ఇప్పుడు చర్చ జరుగుతోంది. అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ ప్రత్యేకంగా చద్దన్నంలోని ఉపయోగాల్ని వెల్లడించడంతో మళ్లీ దీనిపై అందరి దృష్టి పడింది. ఇప్పుడు స్టార్ హోటళ్ల మెనూలోనూ చద్దన్నం చేరిందంటే దీనికి ఎంత ప్రాచుర్యం లభించిందో అర్ధం చేసుకోవచ్చు. స్టార్ హోటళ్లలోని షెఫ్‌లు పెరుగు, కొబ్బరి తురుము, కరివేపాకు, ఆవకాయ, దబ్బకాయ జోడించి కస్టమర్లకు చద్దన్నాన్ని ప్రత్యేకంగా వడ్డిస్తున్నారు. అందుకే కరోనాను ఎదుర్కొనేందుకు ఖరీదైన డ్రై ప్రూట్స్, ఇతరత్రా ఆహార పదార్ధాలు తీసుకోలేని వారు.. వారానికి కనీసం మూడు వాలుగు రోజులు చద్దన్నం తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే మీరు వెంటనే చద్దన్నంతో ఓ పట్టు పట్టండి మరి.