అన్వేష్.. గతకొద్ది రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ మార్మోగిపోతుందీ పేరు. ‘నా అన్వేషణ’ అనే యూట్యబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన అన్వేష్ ప్రపంచాన్ని చుట్టేస్తూ, లక్షల్లో సంపాదిస్తున్నాడనే న్యూస్ తెగ వైరల్ అయింది.
అన్వేష్.. గతకొద్ది రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ మార్మోగిపోతుందీ పేరు. ‘నా అన్వేషణ’ అనే యూట్యబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన అన్వేష్ ప్రపంచాన్ని చుట్టేస్తూ, లక్షల్లో సంపాదిస్తున్నాడనే న్యూస్ తెగ వైరల్ అయింది. ‘నమస్తే ఫ్రెండ్స్ నా పేరు అన్వేష్ నేను ప్రపంచ యాత్రికుడిని వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ నా కళ్ళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని’ ఇది తన ఛానెల్ డిస్క్రిప్షన్. 1.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు 1K వీడియోస్ పోస్ట్ చేశాడు. విశాఖపట్నం, భీమిలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన అవినాష్.. అన్వేష్‌గా మారడం, యూట్యూబ్ ఛానెల్ పెట్టి, ట్రావెలర్‌గా విదేశాల్లో విహరిస్తూ తన వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకోవడం వెనుక ఉన్న స్టోరీ తెలిసి, అలాగే అతని సంపాదన నెలకు అక్షరాలా రూ.30లక్షలని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.
కొద్ది రోజులుగా చైనా టూర్‌లో ఉన్నాడు. అక్కడ చేసిన వీడియోస్ ఎంతలా ట్రెండ్ అయ్యాయో తెలిసిందే. ఆ ఫీడ్ బ్యాక్‌తో ఫుల్ ఖుష్ అయిపోయిన అన్వేష్.. పనిలో పనిగా చైనాలోని పాపులర్ ప్లేసెస్‌ని విజిట్ చేసి మరిన్ని క్రేజీ వీడియోస్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. కట్ చేస్తే, ఇప్పుడు చైనా నుండి రిటర్న్ అయిపోయే ఆలోచనలో ఉన్నాడా?.. రీసెంట్‌గా షేర్ చేసిన వీడియోలో ఇది చైనాలో ఆఖరి వీడియో అని చెప్పాడు. అక్కడి నుండి హాంకాంగ్ వెళ్తున్నానని అన్నాడు బాగానే ఉంది కానీ.. ‘బాధపడకండి, మళ్లీ ఎలక్షన్స్ అయిపోయాక వచ్చి, చైనాని దుమ్ము దులిపేద్దాం. నార్త్ కొరియాది డేట్ మార్చారు. జూలై కాస్త ఏ ఏప్రిల్లో పెట్టాడు’ అంటూ క్లారిటీ ఇవ్వకుండా చెప్పుకొచ్చాడు.
కాగా అన్వేష్ ఇలాంటి సడెన్ డిసిషన్ తీసుకోవడం వెనుక కొన్ని బలమైన రాజకీయ కారణాలున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం చైనాలో చేసిన ఓ వీడియోలో.. అక్కడి యువత జీవన విధానం గురించి చెప్తూ.. మన యువత రాజకీయ నాయకుల వెనుక జెండాలు పట్టుకుని తిరుగుతూ వాళ్లని గొప్పవాళ్లని చేస్తున్నారు తప్ప మీరు ఎదగలేకపోతున్నారు అంటూ పాజిటివ్‌గానే చెప్పాడు. నీతులు చెప్తే తిరిగి బూతులు తిట్టే రోజులు కాబట్టి.. ఈ వీడియో తర్వాత తనకు బెదిరింపులు వస్తున్నాయని, ఏకంగా దేశ ద్రోహి అనేస్తున్నారని స్వయంగా అన్వేష్ చెప్పాడు. కట్ చేస్తే, ఇప్పుడు ఆ బెదిరింపుల కారణంగానే తను టూర్ క్యాన్సిల్ చేస్తున్నాడా?.. ఒకవేళ చేస్తే, ఎన్నికలకి, తన టూర్‌కి లింకేటి?.. తనంతటతానుగా ఓపెన్ అయితే కానీ ఈ విషయంపై క్లారిటీ రాదు అంటున్నారు నెటిజన్లు.