ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దర్శకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు, సొంత మార్క్ క్రియేట్ చేసుకున్న దక్షిణాది దర్శకులలో మణిరత్నం, గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్ కూడా లిస్టులో ఉంటారు. ఈ ముగ్గురు దర్శకులుగా రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ లో మణిరత్నం, గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. వీరు తీసే అన్ని సినిమాలు తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. ఈ ముగ్గురు తెలుగులో కూడా స్ట్రయిట్ మూవీస్ చేశారు. కానీ.. కొన్నేళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ కోసం పరితపిస్తున్నారు ఈ దర్శకులు.
దర్శకులుగా ముగ్గురికి ముగ్గురు ఇండస్ట్రీలో సపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నా.. ఈ మధ్య వీరు రెగ్యులర్ ఫార్మాట్ లో తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవ్వలేదు. దీంతో మణిరత్నం కాస్త బ్రేక్ తీసుకొని తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ మూవీని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులతో పాటు కోలీవుడ్ సినీతారలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ప్రమోట్ చేస్తున్నారు. దర్శకుడిగా మణిరత్నం చేసే మ్యాజిక్ గురించి అందరికి తెలుసు. కానీ.. ఆయన లాస్ట్ హిట్స్ 2015లో ‘ఓకే బంగారం’.. అంతకుముందు 2010లో ‘విలన్’ సినిమాలు.
ఈ రెండు సినిమాల మధ్యలో, తర్వాత వచ్చిన సినిమాలన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే పొన్నియన్ సెల్వన్ తో పాన్ ఇండియా స్థాయిలో కంబ్యాక్ హిట్ కొట్టే ప్లాన్ లో ఉన్నాడు మణిరత్నం. ఇక మరోవైపు స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్.. దర్శకుడిగా సినిమాలు చేస్తూనే కొంతకాలంగా నటుడిగా కూడా కొనసాగుతున్నాడు. అదీగాక ఈ మధ్య దర్శకుడిగా ఫెయిల్ అయినా.. నటుడిగా సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే.. 2010లో ఏం మాయచేశావే వరకు సూపర్ ఫామ్ లో ఉన్న ఈ దర్శకుడు.. చివరిగా 2015లో ‘ఎంతవాడు గానీ’ మూవీతో హిట్ కొట్టాడు. దాదాపు ఏడేళ్లుగా మరో సూపర్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. కానీ.. అనూహ్యంగా నటుడిగా సక్సెస్ అవ్వడం విశేషం.
ఈ క్రమంలో ఇప్పుడు శింబు హీరోగా ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ మూవీ తెరకెక్కించాడు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో అయినా గౌతమ్ మీనన్ కి కంబ్యాక్ హిట్ వస్తుందేమో చూడాలి. ఇక డైరెక్టర్ సెల్వ రాఘవన్.. ఈయనను శ్రీరాఘవ అని కూడా అంటుంటారు. అయితే.. తమిళ, తెలుగు సినిమాలలో సెల్వరాఘవన్ సినిమాలు క్రియేట్ చేసిన మార్క్ మామూలుది కాదు. నేను, 7జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యాగానికి ఒక్కడు లాంటి సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. కానీ.. 2010లో యుగానికి ఒక్కడు, 2011లో ‘మయక్కం ఎన్న’ మూవీస్ తర్వాత ఇప్పటివరకూ ఆ స్థాయి హిట్స్ పడలేదు.
ఇక ఇప్పుడు తనకు లక్ గా కలసివచ్చిన తమ్ముడు, హీరో ధనుష్ తో ‘నేనే వస్తున్నా’ అనే సినిమా తీశాడు. ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో హీరో, విలన్ రెండు పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అయితే.. సెల్వ రాఘవన్, ధనుష్ కాంబినేషన్ లో గతంలో 4 సినిమాలు తీసి హిట్స్ కొట్టాడు. మరిప్పుడు ఐదవ సినిమాగా ‘నేనే వస్తున్నా’ మూవీ.. సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ, తెలుగులో ఏకకాలంలో రిలీజ్ కానున్న ఈ సినిమాతో డైరెక్టర్ సెల్వరాఘవన్ కి కంబ్యాక్ హిట్ లభిస్తుందేమో చూడాలి. ఇదిలా ఉండగా.. సెల్వరాఘవన్ ఈ మధ్య దర్శకుడిగా కంటే నటుడిగా సూపర్ సక్సెస్ అందుకున్న విషయం విదితమే. మరి ఒకప్పుడు కోలీవుడ్ ని శాసించిన ఈ ముగ్గురు దర్శకులు.. బాక్సాఫీస్ వద్ద కంబ్యాక్ హిట్స్ సాధిస్తారేమో వేచి చూడాలి. ఇక డైరెక్టర్స్ మణిరత్నం, సెల్వరాఘవన్, గౌతమ్ మీనన్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
September ~ The comeback month of 3 legendary directors 💥
GVM – #VendhuThanindhathuKaadu
Selvaraghavan – #NaaneVaruvean
ManiRatnam – #PonniyinSelvan pic.twitter.com/q57BrzpCEG— AmuthaBharathi (@CinemaWithAB) September 14, 2022